అదిగదిగో ఆశాకిరణం!

People Support to YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

అడుగడుగునా జగన్‌కు పల్లెజనంఆహ్వానం

జనహోరున సాగిన    ప్రజాసంకల్ప పాదయాత్ర

ప్రతిపక్ష నేతకు పలు సమస్యలపై     విన్నపాలు

నేడు ఆమదాలవలసలో భారీ బహిరంగ సభ  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘అడుగడుగో... మన ఆశాకిరణం... మన ఊరిలోకే వచ్చేస్తున్నాడం టూ...’ పల్లె జనం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. ప్రభుత్వం పట్టించుకోని పలు సమస్యలను ప్రతిపక్ష నేతకు నివేదించేందుకు ముందడుగు వేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు వచ్చిన ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. ప్రభుత్వ తీరుతో అష్టకష్టాలు పడుతున్న వారంతా విన్నవించుకునేందుకు బారులు తీరారు. జగన్‌ వెంట అడుగులో అ డుగు వేశారు. యువతీయువకులు జగన్‌తో సె ల్ఫీ తీయించుకునేందుకు ఉత్సాహం చూపించా రు.   

పాదయాత్ర సాగిందిలా
జన సంక్షేమం కోసం తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం రాగో లులో జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. మ ధ్యాహ్న భోజన విరామ సమయానికి దూసిక్రాస్, బావాజీ పేట, రాగోలుపేట వరకు సాగింది. తర్వాత మళ్లీ ప్రారంభించి ఆమదాలవలస ని యోజకవర్గ పరిధిలోని గట్టుమడిపేట, వంజంగి వరకు, ఆ తర్వాత శ్రీకాకుళం మండలం పరిధి లోని వాకలవలస క్రాస్, లంకాం క్రాస్‌ మీదుగా నందగిరిపేట వరకు యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పలువురు రైతులు జగన్‌ను కలిసి పం టల పరిస్థితులను వివరించారు. వంగ పంటకు మద్దతు ధర లేదంటూ ఆవేదన చెందారు. మరో వైపు ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాలకు చెందిన చెరుకు రైతులంతా కలిసి ఆమదాలవలసలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించా లంటూ కోరారు. అలాగే జిల్లాలో మత్స్యకారుల ముఖ్య నేతలంతా కలిసి జగన్‌కు తమ వినతులను అందించారు. తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారని, దీనికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పకనే చెప్పారు. అలాగే దూసిలోని కాన్‌కాస్ట్‌ ఫ్యాక్టరీ కార్మికులు కూడా జగన్‌ను కలిశారు. అక్రమ లాకౌట్‌ కారణంగా వందలాది మందిమి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేసారు. సోమవారం నాటి యాత్ర జనహోరు నడుమ ముం దుకు సాగింది.  

పాల్గొన్న నాయకులు
పాదయాత్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, రెడ్డి నాగభూషణం, ఎమ్మెల్యేలు కం బాల జోగులు, విశ్వాసరాయి కళావతి, పార్టీ పీఏ సీ సభ్యుడు పాలవలస రాజశేఖరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దు వ్వాడ శ్రీనివాస్, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, గొర్లె కిర ణ్‌ కుమార్, అరుకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజ్, యువనేతలు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎం వీ స్వరూప్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, శ్రీకాకుళం జెడ్పీటీసీ సభ్యుడు చిట్టి జనార్ధనరావు, పలాస పీఏసీఎస్‌ చైర్మన్‌ దువ్వాడ శ్రీధర్, పలాస మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ దువ్వాడ శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, స్థానిక ము ఖ్య నేతలు గేదెల రామారావు, చల్లా రవికుమార్, సు వ్వారి గాంధీ,కాట సాని రాంభూపాలరెడ్డి, యలమంచిలి రవి తదితరులు పాల్గొన్నారు.

కాన్‌కాస్ట్‌ కర్మాగారం తెరిపించండి
పోలాకి: ఆమదాలవలస మండలం దూసి గ్రా మం వద్ద ఉన్న ‘కాన్‌కాస్ట్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమి టెడ్‌’ కర్మాగారం 16నెలలుగా మూతపడిందని, తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కాన్‌కాస్ట్‌ కార్మికులు పాదయాత్రలో కలసి మొరపెట్టుకున్నారు. 700 మంది కార్మికులకు కనీసం ముం దస్తు సమాచారం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి 6 నెలల జీతా లతోపాటు, బోనస్‌లు, పీఎఫ్‌ తదితర చెల్లింపులు దాదాపు 13 కోట్ల రూపాయలు వరకు ఎగ్గొట్టేం దుకు కుట్ర జరుగుతోందని వివరించారు.  

మత్స్యకారులకు న్యాయం చేయండి
సోంపేట: జిల్లాలోని తీర ప్రాంతంలో దుర్భర జీవితం అనుభవిస్తున్న మత్స్యకార సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రతిపక్ష నే త వైస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని తీర ప్రాంత మత్స్యకార ప్రతినిధులు కోరారు. నందివానిపేట వద్ద జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఉపాధి లేక ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది మత్స్యకారులు వలస వెళ్తున్నారని తెలిపారు. జిల్లాలో 98 మంది సముద్రంలో చనిపోయితే వారికి ఇప్పటివరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదన్నారు. విశాఖ నుంచి ఇచ్ఛాపురం వరకు ఒక్క జెట్టీ కూడా లేదన్నారు. పాకిస్థాన్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించాలని కోరారు.

నేడు ఆమదాలవలసలో భారీ బహిరంగ సభ
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవా రం సాయంత్రం 3 గంటల నుంచి ఆమదాలవలస పట్టణంలో ప్రభుత్వ కళాశాల రోడ్డు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం మండలం నందగిరిపేట నుంచి ప్రారంభమయ్యే ప్రజాసంకల్పయాత్ర మధ్యాహ్నం సమయానికి ఆమదాలవలస పట్టణంలో ప్రవేశిస్తుంది.పార్టీ శ్రేణులతో పాటు ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని తమ్మినేని సీతారాం కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top