ఆయన సంకల్పానికి జననీరాజనం

People Support to YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

ఇసుకపోస్తే రాలనంతగా తరలివచ్చిన ప్రజానీకం

జననేతకు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం

అడుగడుగునా నీరాజనాలు పట్టిన మహిళలు

ఉర్రూతలూగించిన సాంస్కృతిక కార్యక్రమాలు

దేశపాత్రునిపాలెంలో పైలాన్‌ ఆవిష్కరణ

కొత్తవలసలో భారీ బహిరంగ సభలో జగన్‌ ప్రసంగం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాసంకల్పమే ఊపిరిగా... అకుంఠిత దీక్షే ఆయుధంగా... అలు పెరుగకుండా సాగుతున్న బహుదూరపు బాట సారి... వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి విజయనగరం జిల్లాలో సోమవారం ఘన స్వాగ తం లభించింది. ఇడుపులపాయనుంచి పాదయాత్రగా బయలుదేరి సోమవారానికి విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం చింతలపాలేనికి ఉదయం 9.30గంటలకు చేరుకున్న ఆయన అక్క డ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కను నాటి పాదయాత్ర ప్రారంభించారు. ఆయనకు స్వాగ తం పలికేందుకు చేరుకున్న అశేష జనసందోహం ఆయన్ను అడుగు ముందుకు వేయనివ్వలేదు. జగనన్నా నువ్వే మా సీఎం అన్నా... అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వెంట నడుస్తున్న ప్రజానీకానికి అభివాదం చేస్తూ జగన్‌ ముందుకు సాగారు. పాదయాత్ర 3000కిలోమీటర్ల మైలురా యి దాటడం ఓ చారిత్రకఘట్టాన్ని పూర్తి చేశారు.

చారిత్రాత్మక పైలాన్‌ ఆవిష్కరణ
ఓ నేత మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటి పాదయాత్ర చేపట్టడం దేశ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం. అలాంటి ఘట్టానికి కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వేదికయ్యింది. అది చిరస్థాయిగా నిలిచిపోయేలా ఓ పైలాన్‌ను ఇక్కడ నిర్మించారు. 30 అడుగుల ఎత్తులో నిర్మించిన పైలాన్‌ మధాహ్నం 3.40 గంటల సమయంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ముం దుగా ఆ ప్రాంగణంలో రావిమొక్కను నాటి న జగన్‌ పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం పావురా లను ఎగురవేశారు. పైలాన్‌ ఆవిష్కరణ సమయంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున భాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా  వైఎస్సార్‌సీపీ పతాకం రంగుల్లో ఏర్పాటుచేసిన బెలూ న్లను వినువీధిలోకి విడిచిపెట్టారు. 

ఆత్మీయ స్వాగతం
విశాఖజిల్లా జంగాలపాలెం నుంచి  సోమవారం ఉదయం విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌మోహన్‌రెడ్డికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆశీర్వచనం చెప్పారు. పలు వురు మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి, జనహారతి పట్టారు. సుమారు ఎనిమిదివేల మందికి పైగా మహిళలు ఘనస్వాగతం పలికారు. మండేఎండను సైతం ఖాతరు చేయకుండా, ఉదయం నుంచి జగనన్నను చూడాలన్న తలంపుతో సా యంత్రం వరకూ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. పలుచోట్ల మహిళలు, యువతులు జగన్‌తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మహిళలు తీన్‌మార్‌ బృందాల డప్పు చప్పుళ్లకు హుషారుగా చిందులేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పండుగ వాతావరణం
జననేతను స్వాగతించిన తీరు పండుగను తలపిం చింది. జగన్‌మోహన్‌రెడ్డి కోసం రోడ్డుపై రెడ్‌కార్పెట్‌లు పరిచారు. పాదయాత్రలో పులివేషాలు, తీన్‌మార్‌ బృందాలు, కోలాటాలు, చిడతలు, బైటోభజనలు, కేరళ నుంచి ప్రత్యేక వాయిద్య బృందాలు, థింసా నృత్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు తదిత ర బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలతో అభిమాననేతకు స్వాగతం పలికారు. తీన్‌మార్‌ బృందంవద్ద ఆశేషంగా తరలివచ్చిన మహిళలు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వంగపండు ఉష నేతృత్వంలో ఆలపించిన గీతాలు జనాలను ఆకట్టుకున్నాయి. 

జనసంద్రమైన కొత్తవలస 
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనంతో కొత్తవలప రోడ్లు పోటెత్తాయి. నియోజకవర్గంలో గ్రా మాల నుంచి అభిమానులు, కార్యకర్తలు, మహిళలు భారీగా ఆటోల్లో తరలివచ్చారు. కొత్తవలసలో విజయనగరం రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సునామీని తలపించింది. జనం పోటెత్తారు. దీంతో కొత్తవలస నేల ఈనిందా అన్నట్లు పోటెత్తింది. బహిరంగ సభలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  మాట్లాడుతున్నంతసేపూ యువకులు కేరింతలు కొడుతూ, జగన్‌ అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగా బదులిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ, కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపీ పి.వి.మి థున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి,  సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్‌సీపీ పార్టీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమి టీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, జిల్లా రాజకీయ వ్యవహా రాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంటరీ కో–ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణి, విశాఖ పార్లమెంట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎం.వి.వి. సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, వేచలపు చినరామునాయుడు, రొంగలి జగన్నాథం,  పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు బొ త్స అప్పలనర్సయ్య, మళ్ల విజయప్రసాద్, కర ణం ధర్మశ్రీ, కుంభారవిబాబు, శంబంగి వెంకటచినఅప్పలనాయడు, వాసిరెడ్డి వరదరామారా వు, బడ్డుకొండ అప్పలనాయుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, డీసీసీబీ చైర్మన్‌ మరిశర్ల తులసి, నాఫెడ్‌ డైరెక్టర్‌ కె.వి.సూర్యనారాయణరాజు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, నలందా విద్యా సంస్థల అధినేత ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, జిల్లా ఎస్సీసెల్‌ కన్వీనర్‌ పీరుబండి జైహింద్‌కుమార్, ఇండుకూరి రఘురాజు, కందుల రఘుబాబు, జమ్మాన ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేటి ప్రజాసంకల్ప యాత్ర ఇలా...
సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కొత్తవలస మండలం తుమ్మికాపల్లి నుంచి ప్రారంభమై సాయంత్రం 6.30 గంటలకు వరకు కొనసాగుతుందని తెలిపారు. 7.30 గంటలకు తుమ్మికాపల్లి నుంచి మొదలై అడ్డుపాలెం, నిమ్మలపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్, గంగుపూడి జంక్షన్, ఎల్‌.కోట మండలంలోని మల్లివీడు వరకూ సాగుతుందని తెలిపారు. అక్కడ మధ్యాహ్నం భోజన విరామానంతరం మళ్లీ 2.45 గంటలకు బయలు దేరి గోల్డ్‌స్టార్‌ జంక్షన్, జమ్మాదేవిపేట, రంగాపురం క్రాస్, రంగరాయపురం గ్రామం వరకు సాగుతుందని అనంతరం 6.30 గంటలకు రాత్రి బసకు చేరుకుంటారని రఘురాం వివరించారు. 

జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన రాష్ట్ర నేతలు
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు రాష్ట్ర నేతలు కలిశారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట నియోజకవర్గంలో గల కొత్తవలస మం డలంలోని దేశపాత్రునిపాలెం వద్ద సోమవారం మధ్యాహ్నం భో జన విరామ సమయంలో కడపజిల్లా రాజంపేట మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి కలిశారు. మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్‌చార్జి భూమన కరుణాకరరెడ్డి, పాలిట్‌ బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నలంద వి ద్యా సంస్థల అధినేత అలమండ వరప్రసాద్‌రెడ్డి జగన్‌మోహన్‌రెడ్డితో ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని 3 వేల కిలోమీటర్లు పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం వైఎస్సార్‌సీపీ నాయకుడు దొరబాబు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top