ఆశలకు ఆసరా నువ్వే

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

జగనన్నకు సమస్యలు విన్నవించుకున్న జనం

అడుగడుగునా భరోసా ఇచ్చిన జననేత

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి నగర ప్రజలు అడుగడుగునా తమ సమస్యలు విన్నవించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని విద్యార్థినులు కోరారు.  రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టిందని ఓ బడుగుజీవి కృతజ్ఞత తెలిపారు.  వైఎస్‌ కుటుంబంపై మమకారంతో తమ çకుమారుడికి రాజన్న పేరు జగనన్నతో నామకరణం చేయించి దంపతులు  అభిమానం చాటుకున్నారు. రోడ్డు ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేస్తే టీడీపీ నేతలు ఇంటిపైకి పంపించి దాడి చేయించారని ఓ యువతి వాపోయింది.  ఇలా  అందరి సమస్యలు ఓపికగా వినిన జననేత జగనన్న రానున్నది మన ప్రభుత్వం.. అంతవరకు ఓపిక పట్టండని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  – ప్రజా సంకల్ప యాత్ర బృందం

మా బాబుకు రాజశేఖర్‌గా నామకరణం
మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇల్లు నిర్మించుకున్నాం. అప్పటినుంచి ఆ కుటుంబం అంటే మాకు అంతులేని అభిమానం.అప్పడే నిర్ణయించుకున్నాను. మాకు బాబు పుడితే రాజశేఖర్‌ అని, పాప పుడితే విజయలక్ష్మి అని పేరు పెట్టాలని అనుకున్నాం. ప్రజాసంకల్పయాత్రలో ఆయన తనయుడు జగనన్నను కలిసి మా బాబుకు రాజశేఖర్‌గా జగనన్నతో పేరు పెట్టించాం. ఆయన దీవించారు. బాగా చదివించాలని చెప్పారు.– కుందేటి సుధాకర్, పావని దంపతులు, రంగరాజు వీధి, పూర్ణామార్కెట్, 23వ వార్డు

అర్ధంతరంగా తొలగించారన్నా
నేను ఆంధాయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవాడిని. ఇంజినీరింగ్, మహిళా కళాశాలలో ఆఫీస్‌ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్‌ తదితర విభాగాల్లో 2013లో 42 మందిని కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమను 2017లో అర్ధంతరంగా తొలగించి రోడ్డున పడేయడంతో ఉపాధి కోల్పోయాం. జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించాం. తగిన వివరణ ఇవ్వాలని ఏయూను ఆదేశించినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని జగనన్నను కలిసి విన్నవించాం.– కేవీ వెంకటప్రసాద్, విశాఖపట్నం

వైఎస్సార్‌ దయవల్లే బాగున్నాను..
మాది విశాఖలోని ఆదర్శనగర్‌. నిరుపేద కుటుంబం. 1996లో ప్రమాదవశాత్తు మరుగుతున్న నూనె నా మొహంతో పాటు శరీరంపై పడింది. చికిత్స చేసినప్పటికీ ఆరోగ్యం సరిగ్గా  బాగుపడలేదు. నా రూపం చూసి ఎవరూ గుర్తుపట్టలేని పరిస్థితి. అప్పటి సీఎం చంద్రబాబు హయంలో సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాను.  నాకు శస్త్రచికిత్సకు నిధులు ఇవ్వలేదు. కానీ 2008లో మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకుంటే తక్షణమే రూ.1.50 లక్షలు మంజూరైంది. దీంతో ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాక నా రూపం మెరుగుపడింది. సమాజంలో తిరుగుతున్నాను. అందుకే ఆ మహానేత తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నాలా కాలిన గాయాలతో వికలాంగులుగా మారుతున్నవారికి.. వారికి  సదరం ధ్రువీకరణపత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేయడం లేదు.   – సిహెచ్‌.సునీత, ఆదర్శనగర్‌

జగనన్నతో అక్షరాభ్యాసం
నేను కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. మా కుటుంబానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే అంతులేని అభిమానం. మా బాబు ప్రత్విక్‌కు మూడో సంవత్సరం వచ్చింది. ప్రజాసంకల్ప యాత్రలో ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డితో మా బాబుకు అక్షరాభ్యాసం చేయించాను. బాగా చదివించమని చెప్పి బాబును ముద్దాడారు. పిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకంలో ప్రతి ఒక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.– కండి శ్రీను, మంగాపురం కాలనీ, శివాజీపాలెం, విశాఖపట్నం

నా ఓటు జగనన్నకే
మాది అనంతపురం. ప్రస్తుతం విశాఖ గీతంలో బీటెక్‌ చదువుతున్నాను.  గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలను మా యువత నమ్మేసింది. కాని గెలిచాక దారుణంగా వంచించాడు.   ప్రత్యేకహోదా తెస్తానని చెప్పి దాన్ని కూడా ఓటుకు నోటు కేసుకు తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేకహోదాపై జగనన్న తొలి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. హోదా వస్తే ప్రధానంగా యువతకు మేలు జరుగుతుందని జగన్‌మోహాన్‌రెడ్డి నమ్ముతున్నారు. ఆయనకు మేమంతా మద్దతు తెలుపుతున్నాం. నేను ఇటీవలే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాను. రానున్న ఎన్నికల్లో జగనన్నకే నా మొదటి ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నాను. మన్యం వీరుడి అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి బహూకరించాను.                – వి.మాణిక్యం, బీటెక్‌ విద్యార్థి

అధిక ఫీజులు నియంత్రించండి
మేమంతా విశాఖ ఉషోదయ సెంటర్‌లోని శ్రీలలితా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాం. మా తల్లిదండ్రులు అనేక కష్టాలు పడి మమ్మల్ని చదివిస్తున్నారు. మెరుగైన విద్య పేరుతో ప్రైవేటు పాఠశాలలు ఫీజులు దారుణంగా పెంచేశారు. అంతేకాకుండా నెలకొక కార్యక్రమం పేరి అదనంగా పిండేస్తున్నారు. అనారోగ్యం, ప్రమాదాలకు కారణమైన మద్యాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. సీఎం అయిన వెంటనే వీటిపై దృష్టి సారించాలని జగనన్నను కోరాం.– జయ, లయ, నిర్మల, పవన్, శ్రీలలితా పాఠశాల విద్యార్థులు

అండగా నిలవాలి
ప్రస్తుతం పెన్షనర్లకు పెద్ద వ్యాధులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం హెల్త్‌కార్డుల ద్వారా చికిత్స అందించడం లేదు. దీంతో చాలామంది వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నారు. వారికి పెద్ద కొడుకుగా నిలబడాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం. ఆయనకు సమస్యలు వివరించాం. – అలీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top