పల్లెలన్నీ ఒక్కటిగా..

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

జననేతపై ప్రేమామృతం 256వ రోజూ అదే ఆదరణ

అమృతపురం నుంచి జెర్రిపోతులపాలెం వరకు సాగిన

మహాసంకల్ప పాదయాత్ర దారిపొడవునా బ్రహ్మరథం

ఎదురేగి మంగళహారతులు.. సమస్యల వెల్లువ

విశాఖపట్నం : ‘జననేత జగనన్నా’ అంటూ లౌడ్‌ స్పీకర్లు హోరెత్తగానే ‘అన్న వచ్చేస్తున్నాడ’ంటూ పల్లెలు బారులు తీరుతున్నాయి. నడిరోడ్డు మీదకొచ్చి వేల నయనాలు తమ ఆశల దివిటీ కోసం ఆతృతగా చూస్తున్నాయి. ప్రజానేత పొలిమేరల్లోకి అడుగుపెట్టగానే ఆ పల్లెజనం పరవశించి పోతోంది. ఎదురేగి స్వాగతం పలకడమే కాదు..దారిపొడవునా మంగళహారతులు పడుతూ తమ అభిమానాన్ని చాటుతున్నాయి. ఆయనను చూడాలని.. ఆయన మాట వినాలని ప్రజలు పరితపిస్తున్నారు.

ప్రజాసంకల్ప పాదయాత్ర 256వ రోజు సబ్బవరం మండల పరిధిలోని పల్లెల్లో గురువారం సాగింది. వరుసగా మూడోరోజు పెందుర్తి నియోజకవర్గంలో సాగిన జననేత పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తీన్‌మార్‌ డప్పులు.. కోలాటాలతో స్వాగతం పలికారు. దారిపొడవునా హారతులు పట్టి మహిళలు స్వాగతం పలికారు.

ప్రజాకంటక పాలనపై సమరశంఖం పూరి స్తూ అలుపెరగక పాదయాత్ర సాగిస్తున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 8.45 గంటలకు అమృతపురం నుంచి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి ఇప్పవానిపాలెం మీదుగా జెర్రిపోతులపాలెం వరకు సాగింది. పాదయాత్ర ఆరంభంలో అమృతపురానికి చెందిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు వైఎస్‌ జగన్‌తో అక్షరాభ్యాసం చేయించుకోవాలని బారులు తీరారు. నేరుగా వాళ్ల దగ్గరకు వెళ్లి  ఎ.ఇషితా, పి.రోషన్‌లకు వైఎస్‌ జగన్‌ అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆ చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ గ్రామానికి వైఎస్‌ జగన్‌ వస్తారని తెలిసింది. అందుకే కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆలయాల్లో చేయించాల్సిన అక్షరాభ్యాసం ఆ మహానేత తనయుడు జననేతతో చేయించాలని నిర్ణయించాం. ఆయన మా పిల్లలతో అక్షరాభ్యాసం చేయించడం ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.

గుడ్డలు ఊడదీసి ఈడ్చేశారన్నా..
15 ఏళ్లుగా నివాసం ఉంటున్న మా గుడిసెలను కూల్చేసి మా భూములను లాక్కోవాలని చూసిన టీడీపీ నాయకులను అడ్డుకోగా మమ్మల్ని గుడ్డలు ఊడదీసి మరీ ఈడ్చేశారన్నా అంటూ జెర్రిపోతుల పాలెంనకు చెందిన రంజా దుర్గమ్మ, దువ్వాడ అక్కయమ్మలు వైఎస్‌ జగన్‌ను కలిసి ఆనాటి ఘటనను వివరించారు.  పూర్తి న్యాయం జరిగే వరకు  పార్టీ అండగా ఉంటుందని జగన్‌ హామీ ఇచ్చారు.
సబ్బవరం మండలంలోని నంగినారుపాడు, గంగవరం, పరవాడ మండలం లోని ఇ.మర్రిపాలెం, పెద్ద ముషిడివాడ, గాజువాకలోని అగనంపూడి తలారివానిపాలెం గ్రామాల ట్రై జంక్షన్‌ పరిధి లోని 1570 ఎకరాల డి.ఫారం పట్టా భూములను టీడీపీ ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో తమవద్ద నుంచి బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. శాటిలైట్‌ టౌన్‌ షిప్, స్టేడియం నిర్మాణాల పేరుతో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల ప్‌మెంట్‌ శాఖ ద్వారా జీవో నెం.269ను విడుదల చేసి మా భూములను తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. జీవో 269ను రద్దు చేయించి, బలవంతపు భూ సేకరణ ఆపాలని, మాకు న్యాయం చేయాలని జగనన్నను కోరామని వారు చెప్పారు.

కొండలనూ వదలడం లేదన్నా..
జెర్రిపోతులపాలెం గ్రామాన్ని చేర్చి ఉన్న కొండను ఎలాంటి అనుమతుల్లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారని గ్రామస్తులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు పీలా గోవింద్, పంచకర్ల రమేష్‌బాబుకు చెందిన భూములున్నాయన్న సాకుతో హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ పైపులైన్‌ను మా గ్రామంలోని మా ఇళ్ల మధ్య లోనుంచి వేస్తున్నారని చింతగట్ల పంచాయతీ ప్రజలు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అమృతపురంలో 4.22 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ నాయకుడు రికార్డులు ఏమార్చి జిరాయితీగా చూపించి గుంటూరుకు చెందిన వ్యక్తులకు అమ్మేశారని స్థానికులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

పాదయాత్రలో అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ఎం.వి.రమణమూర్తిరాజు, చెట్టి పాల్గుణ, వంశీకృష్ణ శ్రీనివాస్, రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ సత్తి రామకృష్ణారెడ్డి, ఇందుకూరి రఘురాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, ఎల్‌.ఎం.మోహనరావు, సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైలపూడి భగవాన్‌ జైరామ్, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎం.వి.సుకుమార్‌ వర్మ, రైతు విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్, అన్నంరెడ్డి సత్యనారాయణ, అన్నంరెడ్డి అజయ్‌రాజు, బోకం శ్రీనివాస్, రాష్ట్ర యూత్‌ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర యూత్‌ విభాగం కార్యదర్శి శెట్టి వినయ్, అరకు పార్లమెంట్‌ ఎస్టీసెల్‌ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, అరకు పార్లమెంట్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్‌ కుమార్, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష,  ఇచ్ఛాపురం నుంచి అందాల విక్రమ్, పిలక సంతోష్‌రెడ్డి, ప్రకాశరావు పట్నాయక్, ఆశి సత్యవతి, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, కొవ్వూరు నుంచి హరిచరణ్, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు కొటాన రాము, వీర ప్రతాప్‌రెడ్డి, జిల్లా, నియోజకవర్గ నాయకులు ఈగలపాటి యువశ్రీ, కమరున్నీషా, ఆళ్ల నాగి రెడ్డి, దాసరి రాజు, ముమ్మన వెంకటరమణ, ఎల్‌. బి.నాయుడు, బోకం శ్రీవణ్‌కుమార్, బి.ఎ. నాయుడు, ఇల్లపు ప్రసాద్, చుక్క రామునాయు డు, సిరిపురపు అప్పలనాయుడు, సిహెచ్‌. చెల్లుబాబు, సీహెచ్‌.సూర్యనారాయణ, సిహెచ్‌. దేవు డు,  సింగంపల్లి సన్యాసిరావు, తుంపాల అప్పారావు, దేవుడు,  గంగాధర్, బండారు శ్రీను, పెది శెట్టి శేఖర్, పాలిశెట్టి సురేష్, మడక సూరిబాబు, మొల్లేటి మోహనరావు, అన్నం అప్పారావు, కుర్రు అప్పారావు, వెన్నెల సంతోష్, తుంపాల నానాజీ, గొంప అప్పారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

20-09-2018
Sep 20, 2018, 12:18 IST
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమై.. నేనున్నానంటూ బరోసా ఇస్తున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని..
20-09-2018
Sep 20, 2018, 09:04 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
20-09-2018
Sep 20, 2018, 07:08 IST
అన్నా చిట్టివలస జ్యూట్‌మిల్లు 2009లో లాకౌట్‌ అయింది. సుమారు 6,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తమ ప్రభుత్వం...
20-09-2018
Sep 20, 2018, 06:57 IST
జాబు కావాలంటే జగన్‌ రావాలి. జగనే నెక్ట్స్‌ సీఎం కావాలి అంటూ సాయిగణపతి పాలిటెక్నిక్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు...
20-09-2018
Sep 20, 2018, 06:51 IST
ప్రజా సంకల్పయాత్ర బుధవారం సెంచూరియన్‌ యూనివర్సిటీ ముందు నుంచి వెళ్లడంతో విద్యార్థులంతా జననేతతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పారామెడికల్, బీఎస్సీ...
20-09-2018
Sep 20, 2018, 06:47 IST
మాది కడప. వైఎస్సార్‌ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. దివంగత వైఎస్సార్‌ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి,...
20-09-2018
Sep 20, 2018, 06:42 IST
దివ్యాంగుల చట్టం 2016ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పెరుగుతున్న దివ్యాంగుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్‌ను 4 నుంచి 7...
20-09-2018
Sep 20, 2018, 06:38 IST
సాక్షి, విశాఖపట్నం: యువ తరంగం ఉప్పొంగింది. వజ్ర సంకల్పంతో దూసుకెళ్తున్న ఉద్యమాల సూరీడిని చూసేందుకు పోటెత్తింది. మీరే మా ఆశాకిరణం.....
20-09-2018
Sep 20, 2018, 04:11 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి...
20-09-2018
Sep 20, 2018, 02:57 IST
19–09–2018, బుధవారం  పప్పలవానిపాలెం క్రాస్, విశాఖ జిల్లా   యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా బాబూ? ఉదయం బస చేసిన ప్రాంతానికి దగ్గర్లోనే...
19-09-2018
Sep 19, 2018, 09:11 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు...
19-09-2018
Sep 19, 2018, 08:33 IST
నా పేరు కేవీఎన్‌ కార్తిక్‌. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. దివంగత వైఎస్సార్‌...
19-09-2018
Sep 19, 2018, 08:28 IST
ప్రజాసంకల్పయాత్ర నుంచి.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు సర్కారుకు దడ...
19-09-2018
Sep 19, 2018, 08:24 IST
సాక్షి, విశాఖపట్నం : ఆనందపురం ఆనంద పారవశ్యమైంది. ఆత్మీయత పంచింది. అభిమాన జల్లు కురిపించింది. కారుచీకటిలో కాంతిపుంజంలా దూసుకొస్తున్న సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 08:19 IST
‘బాబూ నాన్న పేరు నిలబెట్టాలి. ప్రజలంతా నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాముడిలాంటి పాలన అందించు’ అని ప్రజా సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 03:44 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులన్నీ రద్దు చేస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు...
19-09-2018
Sep 19, 2018, 03:28 IST
18–09–2018, మంగళవారం  ముచ్చెర్ల క్రాస్, విశాఖపట్నం జిల్లా బాబు పాలనలో విద్యా వ్యాపారులకు ఎర్ర తివాచి  మంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు...
18-09-2018
Sep 18, 2018, 20:35 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 266వ రోజు షెడ్యూల్‌...
18-09-2018
Sep 18, 2018, 14:38 IST
సినీ న‌టుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు.
18-09-2018
Sep 18, 2018, 09:23 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top