జననేతపై పూల వర్షం

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

అభిమానం చాటుకున్న పల్లెజనం

పాదయాత్ర పల్లెల్లో ఉప్పొంగిన జనాభిమానం

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న ప్రజలు

పెందుర్తి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన పాదయాత్ర

సాక్షి, విశాఖపట్నం: రగిలే ఎండలో చల్లని గొడుగు పట్టినట్టు కరిమబ్బులు కమ్ముకున్నాయి. భానుడి ప్రతాపంతో వేడెక్కిన పుడమిపై చిరుజల్లులు కురిపించాయి. మరో వైపు..అలుపెరగక సాగుతున్న ఆ బహుదూరపు బాటసారి ఆ పాదాలు నొవ్వకుండా దారిపై పూల తివాచీ పరిచి అభిమాన జల్లు కురిపించారు. దారిపొడవునా పూలపరిమిళంతో నింపేశారు. రేపటి సౌభాగ్యానికి భరోసాలాంటి చిరునవ్వుతో నడుస్తున్న జననేతను చూసేందుకు దారిపొడవునా జనవాహిని పోటెత్తింది.

తమ బతుకుల్లో నవ్వుల పువ్వులు విరిసేలా చేయాలన్న సంకల్పంతో సుదీర్ఘ పాదయాత్ర సాగిస్తున్న జనపథికుడిపై హృదయాలు నుంచి ఉప్పొంగిన ప్రేమాభిమానాలు చూపారు. మేళతాళాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జననేత సంకల్ప సిద్ధి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిపి త్రిమతాల పెద్దలు ఆశీర్వచనాలు అందించారు. అక్కచెల్లమ్మలు దారిపొడవునా హారతులిచ్చారు. గుమ్మడికాయలతో దిష్టితీశారు.. బాణసంచా సందడి మధ్య పాదయాత్ర సాగిన పల్లెలు తిరునాళ్లను తలపించాయి. రోజూ మాదిరిగానే దారిపొడవునా వందలాది మంది జననేతకు తమ గోడు చెప్పుకున్నారు.

ప్రజాసంకల్పయాత్ర 254వ రోజు మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం రామచంద్రపురం నుంచి ప్రారంభమైంది. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, కో ఆర్డినేటర్లు గుడివాడ అమర్‌నా«థ్,  వరుదు కల్యాణిలతో కలిసి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బొట్టవానిపాలెం, కె.సంతపాలెం, చంద్రయ్యపాలెం, సూదివలస జంక్షన్‌ దాటిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామానికి ఆగారు. మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర అయ్యన్నపాలెం వద్ద పెందుర్తి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. అయ్యన్నపాలెం, మర్రిపాలెం జంక్షన్‌ మీదుగా గుళ్లేపల్లి గ్రామం వరకు సాగింది. అయ్యన్నపాలెం గ్రామ పొలిమేరల్లో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజు ఆధ్వర్యంలో వేలాది మంది పార్టీ శ్రేణులు, ప్రజలు జననేతకు అపూర్వ స్వాగతం పలికారు. సబ్బవరం మండలంలో అడుగుపెట్టింది మొదలు గుళ్లేపల్లి వరకు దారిపొడవునా పూలు చల్లి రాజన్న బిడ్డను ఆ పూలపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్ర సాగిన దారుల్లో వేలాది మంది ప్రజలు ఎదురేగి స్వాగతం పలికి  తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు.
వ్యర్థ జలాలతో భూగర్భ జలాలు కలుషితంజవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు విడుదల చేస్తున్న రసాయన వ్యర్థజలాల వల్ల తమ ప్రాంతంలోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంనకు చెందిన గ్రామస్తులు అయ్యన్నపాలెం వద్ద జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. ఈ వ్యర్థ జలాల వల్ల మత్స్యసంపద నశించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ ప్రాంతానికి చెందిన 600 మందికి ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పి ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదని జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.

సంకల్పయాత్రలో మాజీ ఎంపీ ఎం.మిథున్‌రెడ్డి, పాదయాత్ర ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రాఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, కిలివేటి సంజీవయ్య, మాజీమంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మత్స్యరాస బాలరాజు, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా సమన్వయకర్త కౌర శ్రీనివాసరావు, అసెంబ్లీ నియోజగకవర్గాల సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజు, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర గణేష్, కోలా గురువులు, ఎం.వి.రమణమూర్తిరాజు, పి.వి.ఎల్‌ నరసింహరాజు, ముదునూరి ప్రసాదరాజు, గుణ్ణం నాగబాబు, బియ్యపు మధుసూధనరెడ్డి, కొఠారు అబ్బాయి చౌదరి, కొండేటి చిట్టిబాబు, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, పైలా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు ప్రగడ నాగేశ్వరరావు, తాడి విజయభాస్కరరెడ్డి, జాన్‌ వెస్లీ, సత్తి వెంకటరెడ్డి, కర్రి పాపారాయుడు, మేరుగ మురళీధర్, బైలపురి భగవాన్,మాజీ విజిలెన్స్‌ ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, రాష్ట్ర యూత్‌ విభాగం ప్రధాన కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి, రాష్ట్ర యూత్‌ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యోగేంద్రబాబు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీదేవివర్మ, నాయకులు చొక్కాకుల వెంకటరావు, కిరణ్‌రాజు, వి.వి. చినరామునాయుడు, వకలపురెడ్డి వెంకట రాజారావు, గొల్లవిల్లి సంజీవరావు, గొల్లవిల్లి ప్రభావతి, కాళింగ కల్యాణరాజు, చింతపల్లి నుంచి బూసర కృష్ణారావు, గొర్లె కోటేశ్వరరావు, మద్ది గోవర్దనగిరి, చెల్ల ఎర్నినాయుడు, మంగ, వనిత, సత్యం, తుంపాల అప్పారావు, ఉగ్గిన గంగునాయుడు, బోకం శ్రీను, దాసరి రాజు, ముమ్మన వెంకటరావు, ఎల్‌.బి.నాయుడు, బోకం శ్రవణ్‌కుమార్, చిరికి దేవుడు, ఇసరపు గోవింద్,  కాకినాడ పట్టణ మహిళ అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, పసుపులేటి చంద్రశేఖర్, రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యదర్శి సయ్యద్‌ హజరత్‌ పీరన్, వైఎస్సార్‌ కడప జిల్లా మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బిడ్నీ గౌస్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల సంఘం కార్యదర్శి అలజంగి కృష్ణ, దెందులూరు నుంచి మేక లక్ష్మణరావు, బల్లి సత్యనారాయణ, సైదుల సురేష్, గుండం నాగబాబు, జానంపేట బాబు, సీహెచ్‌.కుమార్‌ దత్తాత్రేయ వర్మ, పొన్నూరు శోభన్‌బాబు, పి.వీర్రాజు, కడియాల సతీష్, దొండపాటి రాజ్‌కుమార్, కొర్రపాటి ప్రభుదేవా,పేరిశెట్టి ప్రసాద్, సుగనాని సుధీర్, ఎం.వి.వి.ప్రసాద్, కర్నూలు నుంచి రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, మండపేట నుంచి నల్లమిల్లి వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ ముత్యాల నాయుడు, హైదరాబాద్‌ నుంచి వాసు, కోడుమూరు నుంచి రామిరెడ్డి, నల్గొండ మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ చేయూత మాకు భరోసా
చంద్రబాబు రుణమాఫీ హామీతో నిలువునా మునిగిపోయాం. కనీసం పసుపుకుంకుమ కింద ఇస్తానన్న రూ.10వేల్లో రూ.2వేలుకూడా జమకాలేదు. అసలుకు వడ్డీ కడుతున్నామే తప్ప అప్పులు పుట్టడం లేదు. మీరు నిన్నటి కోటపాడుసభలో ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల్లో 45 ఏళ్లుదాటిన మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా నాలుగు విడతల్లో రూ.75వేలు ఉచితంగా ఇస్తామన్న ప్రకటన మా బతుకులకు భరోసానిచ్చిందంటూ కె.సంతపాలెం గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రైవాడ చెంతనే ఉన్నా సాగునీరు లేదు
రామచంద్రపురం చేరుకున్న జగన్‌కు రైవాడ రిజర్వాయర్‌ ఆయకట్టు రైతులు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. చెంతనే ప్రాజెక్టు ఉన్నప్పటికీ నీరందడం లేదని వాపోయారు. ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించాలని జననేతను కలిసి వేడుకున్నారు. మరో వైపు జీవీఎంసీ నీటి సరఫరా  చేసే రైవాడ కాలువపై పనిచేసే లస్కర్లు కూడా జననేతను కలుసుకున్నారు. జీవీఎంసీలో 21 ఏళ్ల నుంచి ఔట్‌సోర్సింగ్‌లో 136 మంది పనిచేస్తున్నా నేటికీ తమ సర్వీసు క్రమబద్ధీకరించలేదని, తగిన వేతనాలు కూడా చెల్లించడం లేదని మొరపెట్టుకున్నారు. తమ పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేవని, మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్సుమెంట్‌ అమలు కావడం లేదని పలువురు విద్యార్థులు బొట్టవానిపాలెం వద్ద జననేతను కలిసి వివరించారు. మీరు సీఎం అయితేనే మా జీవితాలు బాగుపడతాయని ఆకాంక్షను వెలుబుచ్చారు. కె.సంతపాలెం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు వైఎస్‌ జగన్‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top