జనాదరణ అపూర్వం

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

ఏ పల్లెకు వెళ్లినా అదే ఆప్యాయత

అభిమాననేత వెంట కిలోమీటర్ల మేర అడుగులు వేస్తున్న జనం

పల్లెల్లో వినూత్న రీతిలో అపూర్వ స్వాగతం

233వ రోజు సంకల్పయాత్రలో ఆదివాసీలతో అడుగులు

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి  ,కాకినాడ: ఏ పల్లెకు వెళ్లినా జనమే జనం. జననేత అడుగు పెట్టాక జనజాతరను తలపిస్తున్నాయి.  వ్యవసాయ కూలీలు, రైతులు, వికలాంగులు, మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో అడుగులు వేస్తున్నారు. కిలోమీటర్ల మేర అభిమాన నేత వెంట నడుస్తున్నారు.అలుపెరగని యోధుడికి సంఘీభావం తెలుపుతున్నారు. తమ బాధలు చెప్పుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఆద్యంతం తండోప తండాలుగా జనం తరలిరావడంతో రహదారులు జనదారులుగా మారిపోతున్నాయి. పాదయాత్ర సాగే గ్రామాల్లో వినూత్న రీతిలో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్రికుడి రాకను పండగగా జరుపుకొంటున్నారు.

మూడో రోజూ అదే ఆదరణ   
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 233వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని రౌతులపూడి మండలంలో పారుపాక జంక్షన్‌ నుంచి ప్రారంభమై డీజేపురం శివారు వరకు కొనసాగింది. గురువారం 6.2 కిలోమీటర్ల మేర నడిచారు. మూడో రోజు కూడా రౌతులపూడి మండలంలో అదే ఆదరణ, ఆప్యాయతను చూపించారు.  పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పారుపాక జంక్షన్‌ వద్ద పాదయాత్ర ప్రారంభం కాగా డీజే పురం చేరుకునేసరికి జన ప్రభంజనమైంది. దారి పొడవునా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. వేద పండితులు సంప్రదాయ రీతిలో పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మహిళలు మంగళహారతులు ఇచ్చారు. జననేతను చూసేందుకు ఊరు ఊరంతా కదలి వచ్చింది. వైఎస్‌ జగన్‌ వస్తున్నారన్న సంతోషంతో పాదయాత్ర సాగే రహదారిపై చీరలు పరిచారు. జననేత పాదాలకు ధూళి అంటకూడదని రహదారి పొడవునా రెడ్‌ కార్పెట్‌ మాదిరిగా చీరల మీదుగా నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక పాదయాత్ర ఆద్యంతం విద్యార్థులు, మహిళలు సెల్ఫీల కోసం ఉత్సాహం చూపారు. విద్యార్థినులు, రైతులు, వృద్ధులు జననేతతో కలిసి అడుగులు వేశారు. ఎక్కడా ఎవరినీ నిరాశపరచకుండా అందరితో కరచాలనం చేసి వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.

ఆదివాసీలతో అడుగులు....
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంప చోడవరం నియోజకవర్గానికి చెందిన ఆదివాసీలు డీజేపురం వద్ద వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ బాధలు, సమస్యలు చెప్పుకొన్నారు. అనంతరం ఆదివాసీ సంప్రదాయ బద్ధంగా ధరించే తలపాగాను జననేత శిరస్సుపై ఉంచారు. కొమ్ములతో కూడిన తలపాగాను ధరించడమే కాకుండా విల్లు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా ఆదివాసీ మహిళలతో కలసి కాసేపు పాదయాత్ర చేశారు. దీంతో గిరిజన మహిళలు పట్టరాని సంతోషానికి లోనయ్యారు.

పాదయాత్రికుడి వెంట పార్టీ శ్రేణులు
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సమన్వయకర్తలు పర్వత పూర్ణచంద్రప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆకుల వీర్రాజు, నాగులాపల్లి ధనలక్ష్మి,  అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పార్టీ నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, పితాని అన్నవరం, కర్రి పాపారాయుడు, అలమండ చలమయ్య, బెహర దొరబాబు,  ఈగల అప్పారావు, వాసిరెడ్డి జమీల్,  శెట్టిబత్తుల కుమార్‌రాజా తదితరులు నడిచారు. 

స్థానిక సమస్యలతో బాధితులు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియింబర్స్‌మెంట్‌ ప్రస్తుతం సక్రమంగా అందడం లేదని, విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని పలువురు విద్యార్థులు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌తోనే మంచి రోజులు వస్తాయని, విద్యార్థుల కోసం ప్రకటించిన పథకాలు మా భవిష్యత్‌కు ఉపయోగపడతాయన్న నమ్మకం ఉందని విశ్వససిస్తూ సదరు విద్యార్థులంతా జననేతకు గులాబీ పూలు ఇచ్చి  హర్షాన్ని తెలియజేశారు. సామాన్య మహిళల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని పలువురు మహిళలు జగన్‌ను కలిసి గుర్తు చేశారు. కానీ, తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. జగన్‌ సీఎం అయితేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు మంజూరు చేయడం లేదని డీజేపురానికి చెందిన గొల్ల అమ్మాజీ, నక్కల దేవుడమ్మ, కొల్లి లోవరాజు, నక్కల దేవి పాదయాత్ర ద్వారా తమ వద్దకు వచ్చిన జగన్‌ ఎదుట వాపోయారు. అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. 75 ఏళ్లైనా పింఛను మంజూరు కాలేదని కొల్లు నాగరాజు అనే వృద్ధుడు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హత ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం తనకు పింఛను ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. తనకు పింఛను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డీజేపురానికి చెందిన కొల్లి భూలక్ష్మి, అప్పలనర్సమ్మ తదితరులు జగన్‌ వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం, ఎస్‌.అగ్రహారం తదితర ప్రాంతాలకు వెళ్లి పిల్లలు చదువుకోవల్సి ఉందని, బస్సుల్లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వైఎస్సార్‌ హయాంలో మంజూరైన పింఛన్‌ను ఈ ప్రభుత్వం తీసేసిందని,  వెయ్యి రూపాయలు పింఛను ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఉన్న పింఛన్‌ను తీసేసి రోడ్డున పడేసిందని, నాలుగేళ్లుగా నరకం చూస్తున్నామని పారుపాక జంక్షన్‌కు చెందిన మసలపాక సూర్యారావు వైఎస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాల్లో ఒక్క రూపాయి మాఫీ చేయలేదని డీజే పురానికి చెందిన అంజన్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేయగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని గొర్ల అమ్మాజీ ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు

12-12-2018
Dec 12, 2018, 16:52 IST
ఏపీలో ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహంగా..
12-12-2018
Dec 12, 2018, 09:01 IST
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం...
12-12-2018
Dec 12, 2018, 08:18 IST
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు అవినీతి చేసి దొంగగా దొరికిపోతాననే...
12-12-2018
Dec 12, 2018, 08:09 IST
అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాలు అందడం లేదంటూ బాధితులంతా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఎన్నిసార్లు...
12-12-2018
Dec 12, 2018, 08:07 IST
శ్రీకాకుళం అర్బన్‌: ఆమదాలవలస నియోజకవర్గంలో మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని పరివర్తన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ రవికుమార్, ట్రస్ట్‌...
12-12-2018
Dec 12, 2018, 08:05 IST
శ్రీకాకుళం  :రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం పనికి తిగిన వేతనం...
12-12-2018
Dec 12, 2018, 08:02 IST
శ్రీకాకుళం  :రాష్ట్రంలో మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో అనేక...
12-12-2018
Dec 12, 2018, 08:00 IST
శ్రీకాకుళం  :‘అన్నా.. తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలి’ అని తెలగ జేఏసీ సభ్యులు బత్తుల లక్ష్మణరావు, కె.సత్యనారాయణ ప్రతిపక్ష నేత...
12-12-2018
Dec 12, 2018, 07:48 IST
శ్రీకాకుళం అర్బన్‌: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఖరీఫ్‌ నుంచి ఇప్పటి వరకూ వర్షాభావం సరిగా లేకపోవడంతో అందరూ ఇబ్బంది పడుతున్నారని,...
12-12-2018
Dec 12, 2018, 07:46 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అన్నదాతల అభిమానం కట్టలు తెంచుకుంది. ఆనందం అవధులు దాటింది. దృఢ సంకల్పం తో ప్రజాసంకల్పయాత్రగా వస్తూ...
12-12-2018
Dec 12, 2018, 07:43 IST
శ్రీకాకుళం  :‘అన్నా... మా అబ్బాయి సత్యనారాయణకు అక్షరాభ్యాసం చేసి దీవించండి’ అని సరుబు జ్జిలి మండలం అమృత లింగాలవలస గ్రామానికి...
12-12-2018
Dec 12, 2018, 07:42 IST
శ్రీకాకుళం  :‘అన్నా.. మీరు సీఎం అయిన తర్వాత సాగునీటి వనరులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పందలపాడు...
12-12-2018
Dec 12, 2018, 07:39 IST
శ్రీకాకుళం  :‘అన్నా.. పక్షవాతంతో ఏడాదిన్నర నుంచి బాధపడుతున్నాను. ప్రతి నెల మందులు, ఫిజియోథెరపీకి రూ. 2500 ఖర్చు అవుతోం ది....
12-12-2018
Dec 12, 2018, 07:35 IST
శ్రీకాకుళం ,ఆమదాలవలస : తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ మహా ఓటమి పాలైందని వైఎస్సార్‌...
12-12-2018
Dec 12, 2018, 07:14 IST
శ్రీకాకుళం  :‘వైద్యశాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ విధానంలో విధులు నిర్వహిస్తున్నాం సార్‌. నేటికీ క్రమబద్ధీకరణ జరగలేదు’ అని నర్సింగ్‌ సంఘ...
12-12-2018
Dec 12, 2018, 03:55 IST
చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే మనందరం నివ్వెరపోతాం. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎన్నికలు చూశాం. చంద్రబాబునాయుడు గారి ఎల్లో మీడియా...
12-12-2018
Dec 12, 2018, 03:38 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,435.1 కిలోమీటర్లు 11–12–2018, మంగళవారం, కృష్ణాపురం, శ్రీకాకుళం జిల్లా.  తెలంగాణ ఫలితాలు ఊసరవెల్లికి ఉండేలు దెబ్బల్లాంటివి..  ఈరోజు పాదయాత్ర ఆమదాలవలసలో సాగింది....
11-12-2018
Dec 11, 2018, 18:11 IST
సాక్షి, శ్రీకాకుళం : ఆముదాలవలసలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు....
11-12-2018
Dec 11, 2018, 17:39 IST
భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే
11-12-2018
Dec 11, 2018, 07:46 IST
శ్రీకాకుళం :సొంత పంట భూములున్నా పంట రుణాలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను వైఎస్‌ జగన్‌కు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top