హోరెత్తిన యాత్ర

People Support To YS Jagan inPraja Sankalpa Yatra - Sakshi

సంకల్పయోధుడికి ఘన స్వాగతం

నేడు ఆమదాలవలస నియోజకవర్గంలో

అడుగు పెట్టనున్న జగన్‌  

సాక్షి ప్రతినిధి,శ్రీకాకుళం: ప్రజాసంకల్ప యాత్ర హోరెత్తింది. సంకల్ప యోధునికి వేలాది మంది జనం మద్దతు పలికి అడుగులో అడుగు వేశారు. జిల్లాలో ప్రజాసంక  ల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో సమస్యలు చెప్పుకున్న బాధితులను ఓదార్చుతూ తనదైన శైలిలో జగన్‌ భరోసా ఇచ్చారు. గ్రామాలన్నీ ఒక్కటైనట్లుగా జ గన్‌ను చూసేందుకు తరలిరాగా, మహిళలు కుంకుమబొట్టు పెట్టి ఆశీర్వదించారు. మంగళవారం ఉదయం రాజాం మండలం అంతకాపల్లి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర... మధ్యాహ్న సమయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలంలోకి రాగా, అక్కడి ఘన స్వాగతం తర్వాత ధవళపేట వద్ద వరకు యాత్ర సాగింది. ఎచ్చెర్ల నియోజకవర్గ సరిహద్దు నుంచి జగన్‌ వెంట వేలాది మంది కార్యకర్తలు, జనాలు అడుగులు కలిపారు. యాత్రలో భాగంగా జి.సిగడాం మండలం గేదెలపేట, వీఆర్‌ అగ్రహారం క్రాస్, పొగిరి మీదుగా మర్రివలస, జి.సిగడాం మండలం గేదెలపేట, మెట్టవలస క్రాస్, సంతవురిటి వరకు సాగింది. జిల్లాకు చెందిన అగ్రనేతలు కూడా ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొంటూ నే జిల్లాలో రాజకీయ పరిస్థితులను జగన్‌ దృష్టిలో పెట్టారు. బుధవారం ఉదయం పొందూరు పట్టణంలో పాదయాత్ర అడుగుపెట్టడంతో ఆమదాలవలస నియోజకవర్గంలో యాత్ర ప్రారంభం కానుంది. అయితే తర్వాత మళ్లీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో యాత్ర కొనసాగనుంది.

ఘన ఆహ్వానం...
మంగళవారం మధ్యాహ్నం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్, రాజాం నియోజకవర్గం నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. జి.సిగడాం మండలం మర్రివలస గ్రా మం వద్ద ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భారీగా జనాలు తరలిరావడంతో యాత్ర మార్గం అంతా జనసంద్రంగా మారిం ది. వందల సంఖ్యలో యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి ‘రావాలి..జగన్‌.. కావాలి సీఎం జగన్‌..’ అంటూ నినాదాలు చేశారు. అలాగే నెమలి డ్యాన్స్‌ తదితర సంప్రదాయ నృత్యాలు, తీన్‌మార్‌ వాయిద్యాలు, డ్యాన్సులు చేస్తూ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మర్రివలస, గేదెలపేట, పాలఖండ్యాం, సంతవురిటి వరకు జనహోరులో జగన్‌ పాదయాత్ర సాగింది. భారీగా జనం రావడంతో ప్రధా న రహదారి అంతా సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

వినతులు.. విన్నపాలు..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ను కలు సుకుని తమ సమస్యలను వినతుల రూపంలో అందజేశారు. రాజాం నగర పంచాయతీలో 25 ఏళ్లు నుంచి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఉద్యోగ భద్రత లేదంటూ కార్మికులు గోడు వెల్లబుచ్చారు. న్యాయవాదులు తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్‌సెల్‌ కన్వీనర్‌ రఘుపాత్రుని చిరంజీవి ఆధ్వర్యంలో న్యాయవాదులంతా జగన్‌ను కలిసి న్యాయవాదులకు సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు. అలాగే మంగళవారం జగన్‌కు పలు మతాల ప్రతి నిధులు ఆశీర్వదించారు. ముందుగా అంతకాపల్లి వద్ద శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు, శ్రీకాకుళానికి చెందిన మహ్మద్‌ రఫీ ఆధ్వర్యం లో ముస్లిం సంఘ ప్రతినిధులు, అలాగే పాస్టర్స్‌ మినిస్టరీ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు వేర్వేరు ప్రాంతాల్లో కలిసి జగన్‌కు ఆశీర్వదించారు. ఆయ న సంపూర్ణ ఆరోగ్యంతో సంకల్పం సిద్ధించాలం టూ వారంతా దీవించారు. పాదయాత్రలో భాగంగా వెలమ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని పలువురు సంఘ నేతలు కోరారు. పలువురు రైతులు తమ పంట నష్టాలను జగన్‌కు వివరించారు.

పాల్గొన్న ప్రముఖులు
పాదయాత్రలో మంగళవారం జగన్‌ను పలువురు ప్రముఖులు కలిశారు. మరికొందరు ఆయనతో పాటు పాదయాత్రలో అడుగులు కలిపారు. జాతీ య పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం, విజయనగరం, అరకు పార్లమెంట్ల జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం, బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావ తి, కంబాల జోగులు,  శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, పార్టీ నేతలు పాలవలస విక్రాంత్, మామిడి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top