కష్టం గుర్తొచ్చే.. కన్నీరు ఉప్పొంగె..

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

జననేత వద్ద సమస్యలు చెప్పుకుని కన్నీటి పర్యంతమైన జనం

సాక్షి, విశాఖపట్నం: 199 మందిని తొలగించారు : మా నాన్న వయసు 50 ఏళ్లు. ఆయనతో పాటు 199 మంది కార్గో హ్యాడ్లింగ్‌ పోర్టు ప్రైవేట్‌ కంపెనీలో 24 ఏళ్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. రెగ్యులర్‌ చేయాల్సి వస్తుందని 2016లో అందరినీ విధుల నుంచి తొలగించి, నూతన సిబ్బందిని నియమించుకున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని 200 మంది ఉద్యోగులు 75 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. జగనన్నే మాకు న్యాయం చేయగలరని మా నమ్మకం. అందుకే ఆయనకు ఈ సమస్యను వివరించాం. – షర్మీ షారా, గోపాలపట్నం

మేదర్లను ఎస్టీలుగా గుర్తించాలి
దేశంలో అనేక రాష్ట్రాల్లో మేదరి కులస్తులు ఎస్సీ, ఎస్టీ వర్గాల జాబితాలో చేర్చడంతో ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొం దుతున్నారు. ఈ రాష్ట్రంలో మా త్రం మేదరి కులస్తులను బీసీ– ఏ జాబితాలోనే కొనసాగిస్తున్నారు. మా ప్రాంతంలో సుమారు 45 కుటుంబాలు ఉన్నాయి. ఎవ్వరికీ సొంత గృహాలు లేవు. చదువుకున్న పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడం లేదు.– రొట్ట భవానీ, గోపాలపట్నం

ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు
నేను ఎంఏ బీఈడీ చదివాను. మూడేళ్లయినా ప్రభుత్వం ఒక పోస్టూ భర్తీ చేయలేదు. అలాగని తీసిన పోస్టులు అమ్ముకుంటున్నారు. కొంత కాలం కిందట ఎయిడెడ్‌ పోస్టులను రూ.10 లక్షలకు అమ్ముకున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటేనే చదువులకు విలువ. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో మేము అనుభవిస్తున్న దుర్భర జీవితం. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే టీచర్‌ పోస్టుల భర్తీ, నిరుద్యోగుల కష్టాలు తీరుతాయని భావిస్తున్నాం.– ఎం.భాను, పురుషోత్తపురం

స్కూల్‌ ఫీజులు తగ్గించాలి మామయ్య
నా పేరు ఆర్‌.అరవింద. గోపాలపట్నం. నేను చైతన్య స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాను. జగన్‌ మామయ్యను కలవడానికి రెండు రోజుల నుంచి వేచి చూస్తున్నాను. ఈ రోజు ప్రజాసంకల్పయాత్రలో మామయ్యను కలిశాను. ప్రైవేట్‌ స్కూల్‌ల ఫీజు తగ్గించాలని విన్నవించుకున్నాను. నన్ను పెద్ద చదువులు చదువుకోవాలని ఆశీర్వదించారు. జగన్‌ మామయ్య ముఖ్యమంత్రి అవ్వాలని.. మా అందరి భవిష్యత్‌కు భరోసాగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

అర్చకులను ఆదుకునేవారే లేరన్నా
నా పేరు శ్రీనివాసశర్మ. మాది గోపాలపట్నం నాయుడుతోట. పన్నెండేళ్లుగా గోపాలపట్నంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. 2009లో మహా నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్చకుల కోసం ‘దీప ధూప నైవేద్యం’పథకం ప్రవే శ పెట్టారు. గత ఏడేళ్లుగా ఈ పథకాన్ని నీరుగార్చారు. ప్రస్తుతం అర్చకులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా.. అని అని ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి విన్నవించాను. న్యాయం చేయాలని కోరారు.

క్యాబ్‌ డ్రైవర్లను ఆదుకోండి
‘అన్నా.. క్యాబ్‌లు నడుపుకుంటున్న డ్రైవర్లు సొంతంగా కార్లు కొనుక్కునేందుకు రుణా లు, తలదాచుకోవడానికి ఇళ్లు మంజారు చేయించండి. మేము రోజుకు 12–18 గంటలు పనిచేసినా.. ఓలా, ఉబర్‌ సంస్థల నుంచి మాకు సరిపడా ఆదాయం రావడంలేదు. పెరుగుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా మా రవాణా చార్జీలు పెంచుకునే వెసులుబాటు ఉండేలా చూడండి. ప్రమాద బీమా కల్పించండి.  వేధింపుల నుంచి రక్షణ కల్పించండి.’ అంటూ విశాఖ ఆన్‌లైన్‌ క్యాబ్స్‌ ఓనర్స్, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ తరఫు న బి.ఎం.పాత్రుడు జగన్‌కు వినతిపత్రం అందించారు. న్యాయం చేయాలని కోరారు.  

ఆరోగ్యశ్రీతో ప్రాణాలు దక్కాయి
30 ఏళ్ల కిందటే భర్త మరణించాడు. తొమ్మిదేళ్ల కిందట నా కిడ్నీ పాడైంది. వైద్యం కోసం రూ.2 లక్ష లు ఖర్చు అవుతాయన్నారు. అప్పు డు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఆరోగ్య శ్రీ కార్డును చూపిం చాను. అపోలోలో ఎటువంటి సొ మ్ము తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. ఆయన దయ వల్లే నేను ఈ రోజు బతికి ఉన్నాను. ఈ ఆనందాన్ని ఆయన బిడ్డ జగన్‌బాబు వద్ద పంచుకున్నాను. సొంతిళ్లు లేదని ఆయనకు చెబితే.. మన ప్రభుత్వం లో వచ్చిన వెంటనే ఇళ్లు కట్టుకునేందుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. – రామిడి లక్ష్మి, 26వ వార్డు

మరిన్ని వార్తలు

13-11-2018
Nov 13, 2018, 04:32 IST
12–11–2018, సోమవారం  కొయ్యానపేట, విజయనగరం జిల్లా నన్ను చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం మనసును కదిలించింది.. పదిహేడు రోజుల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి మళ్లీ...
13-11-2018
Nov 13, 2018, 04:21 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎవరెన్ని కుట్రలు పన్నినా నీకు దేవుడు అండగా ఉన్నాడు.. నీకేం కాదు...
12-11-2018
Nov 12, 2018, 18:03 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
12-11-2018
Nov 12, 2018, 12:37 IST
రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇస్తామని ఇదివరకే ప్రకటించామని..
12-11-2018
Nov 12, 2018, 11:56 IST
సాక్షి, విజయనగరం : తనపై హత్యాయత్నం జరిగినా అదరక, బెదరక... మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి.. పాదయాత్రను కొనసాగిస్తున్న ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
12-11-2018
Nov 12, 2018, 08:17 IST
హత్యాయత్న ఘటననంతరం జనంలోకి జననేత 
12-11-2018
Nov 12, 2018, 06:56 IST
సంకల్పం మంచిదైతే... ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించవచ్చు. ఆశయం అందరి మేలుకోరేదైతే... ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొనవచ్చు. జనం ఆశీస్సులు మెండుగా...
12-11-2018
Nov 12, 2018, 03:51 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప...
11-11-2018
Nov 11, 2018, 16:37 IST
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్‌: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం...
11-11-2018
Nov 11, 2018, 15:46 IST
సాక్షి, సాలూరు: తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోలుకొని ప్రజలతో...
11-11-2018
Nov 11, 2018, 11:01 IST
సాక్షి, విశాఖపట్నం: ధీరోదాత్తుడు మళ్లీ ప్రజా సంకల్పయాత్రకు సిద్ధమయ్యారు. తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ...
11-11-2018
Nov 11, 2018, 07:28 IST
అన్న వస్తున్నాడు... అవును జగనన్న వచ్చేస్తున్నాడు. కుట్రలను ఛేదించుకుని... మృత్యువుని జయించి... సంకల్పాన్ని చేరుకునేందుకు... జనం మధ్యకు దూసుకు వస్తున్నాడు....
11-11-2018
Nov 11, 2018, 04:07 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 17 రోజుల విరామం అనంతరం ఈ నెల 12 నుంచి...
10-11-2018
Nov 10, 2018, 11:21 IST
విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో..
10-11-2018
Nov 10, 2018, 08:32 IST
శ్రీకాకుళం , పార్వతీపురం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 12న జిల్లాలో పునఃప్రారంభమవుతుందని,...
07-11-2018
Nov 07, 2018, 07:15 IST
ఆయనో.. నవశకం.. చీకటి తెరల్లో చిక్కుకున్న రాష్ట్రానికి నవరత్నాల వెలుగులు నింపేందుకు ఆ యువనేత వేసిన తొలి అడుగు.. ప్రభంజనమైంది....
06-11-2018
Nov 06, 2018, 13:36 IST
పాలకుల్లో సమన్యాయం లోపించింది. కుట్రలుకుతంత్రాలకు పాల్పడుతున్నారు. అడుగడుగునాఅన్యాయానిదే పైచేయి అవుతోంది. అణగారినవర్గాలకు రిక్తహస్తం ఎదురవుతోంది. రైతులకుభరోసా లేదు, అర్హతతో నిమిత్తం...
06-11-2018
Nov 06, 2018, 13:29 IST
హత్యకు కుట్ర.. ఆగ్రహిస్తున్న జనం ప్రజా సమస్యలే అజెండాగా జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండనకా..వాననకా, చలి అనకా పాదయాత్ర సాగిస్తున్నారు....
06-11-2018
Nov 06, 2018, 13:14 IST
ఆయన గమ్యం.. ఐదు కోట్ల ఆంధ్రుల మోముపై చిరునవ్వులొలికించే సంతకంఅడుగడుగునా పేదల కష్టాలను ఆలకించి..    చలించిపోతున్న మానవత్వం. తాను నడిచిన...
06-11-2018
Nov 06, 2018, 13:08 IST
అలుపెరగని బాటసారి అతను. నిత్యం వేలాది మందిని కలుస్తూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకొని...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top