భూమిని లాక్కొనేందుకు చూస్తున్నారు

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :రామసింగవరం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన 1,800 ఎకరాల మెట్ట భూముల్లో మూడు తరాలుగా నివాసం ఉంటూ అదే భూమిలో కొంత సాగు చేసుకుని అనేక మంది రైతులం జీవిస్తున్నాం. ఈ భూములను పరిశ్రమలకు లాక్కోవాలని చూస్తున్నారని ముత్తంటి రామకృష్ణ తదితర రైతులు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ సమస్యను వివరించారు. ఇదే జరిగితే 534 కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. ఫారెస్టు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఈ భూములు ఫారెస్టు భూములని, ప్రభుత్వం పరిశ్రమలు పెడుతుందని, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని వాపోయారు. కోర్టులో పిటీషన్‌ వేయగా, కోర్టు ఆ పంట జోలికి వెళ్లరాదని తీర్పునిచ్చిందన్నారు. ఈ భూమిని దౌర్జన్యంగా వారు తీసుకోకుండా అండగా ఉండాలని జగన్‌ను రామకృష్ణ కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top