వినతుల వెల్లువ

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి : జగనన్నా... నా పేరు మోటమర్రి సదానంద కుమార్, ఏలూరు అర్బన్, జిల్లా వాసవీ సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. మీరు ఆర్య వై«శ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ చేసిన ప్రకటనకు జిల్లా వాసవీ సేవాదళ్‌ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్య వైశ్యులుగా చిన్నచిన్న వ్యాపారాలు, షాపుల్లో గుమస్తాలుగా, బండ్ల మీద చిన్న వ్యాపారాలు చేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబ పోషణ చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు పెట్టుబడి లేక అనేకమంది ఆర్యవైశ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన అనంతరం పేద ఆర్య వైశ్యులకు అండగా రూ.500 కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం. పొట్టి శ్రీరాములు త్యాగానికి ‘సాక్షి’గా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం నవంబర్‌ 1వ తేదీని మీ పరిపాలనలో నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

జగన్‌ గారూ... నా పేరు కర్నాటి కన్నయ్య, ఏపీ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. అన్నా.. సగర (ఉప్పర) కులస్తులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలన్నా. గతంలో టీడీపీ ప్రభుత్వం సగర ఫెడరేషన్‌ ఏర్పాటు చేసినా మాకు ఏవిధమైన ప్రయోజనం లేదన్నా. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత సగర కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. నిధులు కేటాయించి మా కులం అభివృద్ధికి మీ వంతు సహాయం అందించాలన్నా. సగర కులాన్ని ప్రస్తుతం బీసీ–డీ కేటగిరీలో ఉంచారు, మీరు బీసీ–ఏ కేటగిరీలోకి మార్పు చేయాలని కోరుకుంటున్నాం. గతంలో సీఎం చంద్రబాబు పాదయాత్ర సమయంలో హామీలు ఇచ్చారు, మానిఫెస్టోలోనూ పెట్టారు కానీ మా కులానికి ఏమాత్రం న్యాయం జరగలేదన్నా.

జగన్‌ అన్నా...నా పేరు టి.శేఖర్‌ మాదిగ, నేనుమాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా.. మా దళిత వర్గాలకు రక్షణ కవచమైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేయండి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని షెడ్యూల్‌ 9లో చేర్చడానికి మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాం. మా దళిత సామాజికవర్గంలోని ఉపకులాలన్నీ సమానంగా అభివృద్ధి సాధించేలా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. జగన్‌ అన్నా.. దళితుల నిధులు సక్రమంగా వినియోగించి ఆర్థిక, సామాజిక, విద్య పరంగానూ అభివృద్ధి సాధించేలా చేయాలన్నా...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top