ఎస్టీగా గుర్తించడం కుదరదంటున్నారు
పశ్చిమగోదావరి : మాది ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం. 13 సంవత్సరాలుగా గిరిజన సంస్థ హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఏలూరు స్టేడియం వద్ద ఉన్న కాలేజీ హాస్టల్లో పనిచేస్తున్నాను. రికార్డు అసిస్టెంట్‌గా ప్రమోషన్ కల్పించమని అధికారులను వేడుకున్నాను. నువ్వు సిటీలో ఉంటున్నావు, నిన్ను ఎస్టీగా గుర్తించడం కుదరదని వేధిస్తున్నారు. నా భార్య వంట చేస్తూ ప్రమాదానికి గురైంది. నరాలు చచ్చుబడిపోయాయి. నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక రికార్డ్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ కల్పించన్న అంటూ అంధుడు బుక్య దుర్గారావు వేడుకున్నాడు.