జనహితం.. అభిమతం

People Sharing Their Problems To YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం:అడుగడుగునా ఆవేదనలు.. గుండె ఆపరేషన్‌ చేయలేదని ఒకరు.. పథకాలన్నీ టీడీపీ వాళ్లకే కేటాయిస్తున్నారని మరొకరు.. 48 నెలలుగా జీతాల్లేవని తుమ్మపాల సుగర్స్‌ కార్మికులు.. పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయడం లేదని క్వారీ కార్మికులు.. రోడ్డు విస్తరణõ ³రిట ఇళ్లు ఖాళీ చేయిస్తే మా పరిస్థితి ఏంటన్నా?.. ఇలా ఎవరినీ కదిపినా కన్నీటి గాథలే. ప్రజాసంకల్పయాత్రలో జననేతను కలిసి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు తమ కష్టాలు చెప్పుకున్నారు. నీవెంట మేముంటామని.. సీఎం అయిన వెంటనే మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ఇలా ప్రతిఒక్కరి సమస్య ఎంతో ఒపికగా వింటూ ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానని భరోసా ఇస్తూ సంకల్పధీరుడు జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు.–ప్రజా సంకల్పయాత్ర బృందం

జగన్‌ భరోసాతో అన్ని వర్గాల్లో ఆనందం
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనకాపల్లిని జిల్లాగా చేసి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగసభలో చెప్పడాన్ని ఇక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు.  సుగర్‌ ఫ్యాక్టరీ సమస్యలపై జగనన్న ఇచ్చిన భరోసాతో రైతులు, కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి  జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారు. బుధవారం నాటి బహిరంగ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.–గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు

జగనన్న పైనే ప్రజా విశ్వాసం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 250 రోజులుగా పండుగలు, పుట్టిన రోజులు, కుటుంబసభ్యులను వదిలి దూరంగా ప్రజల మధ్యే ఉంటూ కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరుతాయని రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. –వరుదు కల్యాణి, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌

ఆసరా లేదన్నా
నాకు పుట్టుకతోనే పోలియో. కాళ్లు సరిగ్గా లేకపోవడంతో నడవలేని పరిస్థితి. చిన్నప్పుడే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. నా భార్య కూడా అనారోగ్యం బారిన పడి ఈ ఏడాది మే నెలలో మృతి చెందింది. ప్రస్తుతం నేను అనాధ. పుట్టుకతోనే నాకు వైకల్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛన్‌ చెల్లిస్తోంది. నేను వికలాంగుడిని అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. నాసమస్యను జగనన్నకు చెప్పుకుని ఆదుకోవాలని కోరా.       –మమ్మిడిశెట్టి రమేష్,వికలాంగుడు, లక్ష్మిదేవిపేట, అనకాపల్లి మండలం

రోడ్డు విస్తరణకు ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు
మాకు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాం. మండలంలో మా గ్రామంతో పాటు రేబాక, కోడూరు గ్రామాల మీదుగా (అనకాపల్లి–ఆనందపురం) రహదారిని ఆరులైన్లగా విస్తరిస్తున్నారు. రోడ్డును ఆనుకుని ఉన్న మా ఇళ్లను కోల్పోతున్నాం. మూడు నెలల్లో ఇళ్లు ఖాళీ చేయాలని జాతీయ రహదారి విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేసి ఎక్కడ నివాసం ఉండాలో అర్థం కావడం లేదు. మా సమస్యను గుర్తించి కనీసం మాకు ఇండ్లస్ధలాలైన మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరం.–జల్లూరి ప్రసాద్, శంకరం, అనకాపల్లి మండలం

రుణమాఫీ చేయనందునేరైతు ఆత్మహత్యలు
నాపేరు జి.కృష్ణ. మాది  విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని దేవాడ గ్రామం.  రూ.వేల కోట్లులో రైతు రుణమాఫీ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు రైతులు ఆత్మహత్యలు కనిపించడం లేదా. ఎలక్ట్రానిక్, తదితర రంగాల్లో కంపెనీలు తయారుచేసే వస్తువులకు వారే ధర ప్రకటించుకుంటున్నప్పుడు రైతు పండించే పంటకు రైతే ధర  నిర్ణయించేలా చేయాలి. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థి కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పుడు నాణ్యమైన విద్యను ఎందుకు అందించలేకపోతోంది. జగనన్న మాత్రమే పరిష్కరించగలరు. సంకల్పయాత్రలో ఆయనను కలిసి నా అభిప్రాయాన్ని తెలియజేశా.

మౌలిక వసతుల్లేక ఇబ్బందులు
అనకాపల్లి మండలం రిక్షా కాలనీలోని కొండవీధిలో మౌలిక వసతుల్లేక 40 కుటుం బాల వారం ఇబ్బందులు పడుతున్నాం. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవు. వీధి దీపాలు ఏర్పాటుచేయలేదు. సమస్యలు మధ్య జీవనం సాగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదు. మా సమస్యను జగనన్నకు విన్నవించాం.
– నమ్మి లక్ష్మి, రిక్షా కాలనీ,కొండవీధి, అనకాపల్లి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top