అలుపెరుగని యోధుడికి అడుగుకో వినతి

People Sharing Their Problems To YS jagan - Sakshi

విశాఖపట్నం :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను విస్తరించినా ఎన్‌ఎండీసీ తగి నంత ఐరన్‌ ఓర్‌ను సరఫరా చేయడం లేదు. దీంతో సామర్థ్యం ఉన్నా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. రోజుకు నాలుగు టన్నుల ఐరన్‌ ఓర్‌ కొరత ఏర్పడుతోంది. ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి ఐరన్‌ ఓర్‌ కేటాయించాలి. స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మార్కెటింగ్‌ ఫైనాన్స్‌కు సీఆర్‌డీఏ పరిధిలో ఎకరా స్థలం ఇవ్వాలి. మార్కెట్‌ యార్డు కోసం విజయవాడ–రేణిగుంట రైల్వే లైను పక్కన 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. 2017 నుంచి పే రివిజన్‌ పెండింగ్‌లో ఉంది. 12 ఏళ్ల నుంచి పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడం లేదు. ఈ అంశాలన్నీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం.– కె.వి.డి.ప్రసాద్, సంయుక్త కార్యదర్శి,విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌

మా సమస్యలు పరిష్కరించాలి
మేము ఇండియన్‌ క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ నుంచి వ చ్చాం. ఇతర మతాల నుంచి క్రైస్తవ మతంలోకి వచ్చిన వా రికి పాత విధానంలోనే కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. క్రైస్తవులపై దాడి చేసే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. క్రైస్తవ గృహ సంఘాలకు తహసీల్దార్‌ స్థాయిలో రిజిస్ట్రేషన్‌ చేయాలి. క్రైస్తవ మతస్తుల విద్యార్థులకు ఉచిత విద్య, విద్యుత్‌లో రాయితీ కల్పించాలి. పా స్టర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈ అంశాలను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. సానుకూలంగా స్పందించారు.   –జేమ్స్‌ విజయకుమార్, అక్కయ్యపాలెం

నా మొదటి ఓటు మీకే..
‘అన్నా.. నేను సెంచూరియన్‌ వర్సిటీలో బీటెక్‌  చదువుతున్నాను. ఆన్‌లైన్‌లో ఈ యూనివర్సిటీ పేరు చూపించకపోవడం వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లే దు. ఏటా రూ.90 వేలు ఫీజు నేనే కట్టుకోవాల్సి వస్తోంది’ అని మిందివానిపాలేనికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఎస్‌.అనుప్రియ వాపోయారు. మీరు సీఎం అయితే ఉన్నత చదువుల కయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. నాకు ఓటు హక్కు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో నా ఓటు నీకే అన్న అంటూ ఆమె స్పష్టం చేశారు.

ముసలోళ్లం.. వేలి ముద్రలు అరిగిపోయాయి
‘మహానుభావుడు రాజశేఖరరెడ్డి మాలాంటి వృ ద్ధులకు రూ.200 పింఛన్‌ మంజూరు చేశారు. ఈ చంద్రబాబు వచ్చాక వేలి ముద్రలు పడితేనే గాని పింఛన్‌ ఇవ్వడం లేదు. మేము ముసలోళ్లం. వేలి ముద్రలు అరిగిపోయాయి. దీంతో పింఛన్‌ ఇవ్వ డం లేదు’ అని దుక్కవానిపాలెం జంక్షన్‌లో దుక్కు సింహాచలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి మొరపెట్టుకున్నారు. సంవత్సర కాలంలో ఐదు నెలల పాటు పింఛన్‌ ఆపేశారని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇల్లు కట్టుకోమన్నారు.. బిల్లు ఇవ్వ లేదు
‘పూరి గుడిసెలో ఉండేవాళ్లం. పక్కా ఇల్లు కట్టుకుంటే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. నాయకుల మాటలు నమ్మి ఉన్న గుడిసె పీకేసి అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాను. రూపాయి మం జూరు చేయలేదు. మరుగుదొడ్డి నిర్మించాను. దీనికైనా బిల్లు మంజూరు చేయాలని కోరితే పథకం గడువు అయిపోయింది. బిల్లు మంజూరు చేయడానికి కుదరదని చెబుతున్నారు. రూ.20 వేలు ఖర్చుచేసి మరుగుదొడ్డి నిర్మించాను. నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు.  ఒక్క పైసా సాయం అందలేదు. పథకాలన్నీ పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తున్నారు. మాలాంటి పేదోళ్లు ఎలా బతకాలన్నా’ అంటూ దుక్కవానిపాలేనికి చెందిన అడ్డూరి గురువులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ గోడు చెప్పుకున్నారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top