జననేతా నీతోనే మా భవిత

People Sharing Their Problems To YS Jagan - Sakshi

విశాఖపట్నం  : ‘75 ఏళ్లు.. పింఛన్‌ ఇవ్వడానికి ఈ వయసు సరిపోలేదంట.. 90 శాతం వైకల్యం.. పింఛన్‌కు ఈ అర్హత సరిపోదంట.. భర్త చనిపోయి 14 ఏళ్లు.. అయినా పింఛన్‌ ఇవ్వలేరంట.. అదేదో జన్మభూమి కమిటీ అంట.. మా ప్రాణాలమీదకొచ్చింది. వారి పెత్తనం ఏమిటో.. అన్ని అర్హతలున్నా ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాం. నువ్వు అధికారంలోకి వస్తే మా కష్టాలు తీరుతాయి.. ఆ రోజు కోసం మేమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం.’ అంటూ జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వద్ద ప్రజలు తమ గోడు చెప్పుకున్నారు. వారి కష్టాలు విని.. వారందరికీ భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగారు.
–పాదయాత్ర ప్రత్యేక బృందం

ప్రభుత్వం మారితేనేన్యాయం జరిగేది
నా భర్త ఆరు నెలల కిందట మరణించడంతో వితంతు పింఛన్‌ మంజూరు చేయాలని అధికారు లను కోరినా పట్టించుకోవడం లేదు. ఆరు నెలలుగా ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా  ఫలితం లేదు. ఈ ప్రభుత్వం పేద సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం మారితే తప్ప మాలాంటి వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ప్రజల కోసం పరితపించే నాయకుడిగా జగన్‌పైనే మా నమ్మకం. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. –గనివాడ రామయ్యమ్మ, కె. సంతపాలెం,కె.కోటపాడు, మండలం

డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూపులు
మాది పాతవలస గ్రామం కె.కోటపాడు మండలం. టెట్‌ అర్హత సాధించి డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం  గ్రామంలో 25 మంది ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా తాత్సారం చేయడం వల్ల నాలుగేళ్లుగా నిరుద్యోగులగానే ఉండిపోయాం. మా గ్రామానికి కనీసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదు. పరిసర ఆరు గ్రామాల ప్రజలు నిత్యం ఆటోలపై ఆధారపడి సుమారు పది కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. గ్రామానికి సమీపంలో వైద్య సదుపాయం కూడా లేదు. మా సమస్యలన్నీ జగన్‌ అన్నకు చెప్పుకున్నాం. ఆయన అధికారంలోకి వస్తే మాకు మంచి రోజులు వస్తాయి.
–పాతవలస నిరుద్యోగ యువకులు

75 ఏళ్లు దాటినాపింఛన్‌ ఇవ్వడం లేదు
మాది కె.కోటపాడు మండలం గొల్లలపాలెం. నాకు 75 ఏళ్లు దాటింది. అయినా పింఛన్‌ మంజూరుకు వయసు సరిపోలేదంట. కార్యదర్శిని అడిగితే వయసు తక్కువ అంటున్నారు. నేను ఎలా జీవించాలి. నాకు పింఛన్‌ ఇవ్వాలని జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలసి విన్నవించుకున్నాను. వచ్చేది మన ప్రభుత్వమని, అప్పుడు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తామని జగన్‌ బాబు హామీ ఇచ్చారు.            
–పల్లా నారాయణమ్మ

అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేయండి
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కేటాయించి దారి మళ్లించిన రూ.500 కోట్లు సంక్షేమ బోర్డు ఖాతాకు జమచేయాలి. 60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.3వేలు పింఛన్‌ అమలు చేయాలి. కార్మికుల హక్కులను హరించే మెమో 3549/2016–1ను వెంటనే ఉపసంహరించాలి. పెండింగ్‌ క్లైమ్‌లను వెంటనే పరిష్కరించాలి. ఆడపిల్లలకు వివాహం, ప్రసూతి కానుకలను చంద్రన్న బీమాతో సంబంధం లేకుండా రూ.30 వేలకు పెంచాలి. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి. కార్మిక శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. చోడవరం కార్మికశాఖ పరిధిలో 36 వేల మంది కార్మికులు ఉన్నందున శాశ్వత భవన నిర్మాణం కల్పించాలి. ఈ విషయమై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించాం.
– కొసర తాతారావు, రాజబాబు, అసంఘటిత రంగకార్మిక సంఘం ప్రతినిధులు

వీఆర్‌వోల పాలిట దేవుడు వైఎస్‌
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 39 ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో గౌరవవేతనం పొందుతున్న 15 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మా పాలిట దేవుడయ్యారు. ఇప్పుడు మాకు ప్రమోషన్‌ ఇచ్చి సీనియర్‌ అసిస్టెంట్‌గా, తహసీల్దార్‌గా చేస్తే మండలం మొత్తాన్ని ప్రభావితం చేస్తామని ‘ఏపీఆర్‌ఎస్‌ఏ’ను బూచిగా చూపించి అడ్డుకుంటున్నారు. వాస్తవానికి మాకు 40 శాతం, ఏపీఆర్‌ఎస్‌ఏ వారికి 60 శాతం ప్రమోషన్లు ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది. పాత జీవో ప్రకారం మాకు 60 శాతం కేటాయించాలి. మా న్యాయమైన కోరి కను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి కోరాం. వీఆర్‌వో, వీఆర్‌ఏలకు రూ.20వేల వేతనం అమలు చేయాలని విన్నవించాను. – పేతురు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, ఏపీ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌

90 శాతం  వైకల్యం ఉన్నా...
‘అన్నా.. నాకు 90   అంగవైకల్యం ఉంది. పింఛన్‌ రూ. 1000 మాత్రమే ఇస్తున్నారన్నా’ అంటూ గొల్లలపాలేనికి చెందిన బొట్టా రమణమ్మ జగన్‌ను కలసి వాపోయింది.  80 శాతం వైకల్యం దాటితే రూ.1500లు పింఛన్‌ ఇవ్వాలని, కానీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను నడవలేకపోతున్నాను. నాకు ట్రై సైకిల్‌ ఇíప్పించండి అన్నా. ఉండటానికి పక్కా ఇల్లు కూడా లేదని’ తన గోడును వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి వినిపించింది.

రైవాడ నీరు ఇక్కడ రైతులకే...
ప్రస్తుతం రైవాడ జలాశయం నుంచి నీటిని విశాఖకు తరలిస్తున్నారు. కె.కోటపాడు సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరం పూర్తి చేసి తరువాత రైవాడ నీటిని ఇక్కడి రైతులకు అందిస్తామన్నారు. ఈ మాట మాకు ఎంతో ఆనందదాయకం. ప్రస్తుతం మాకు చెరువులు ఉన్నా.. నీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. రైవాడ నీరు రైతులకు ఇస్తే 10 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి.– బొడ్డ దేముడు, పిల్లల గంగులు

మరిన్ని వార్తలు

21-09-2018
Sep 21, 2018, 13:00 IST
జన హితుడై... జన శ్రామికుడై... జనమే తన కుటుంబంగా...వారే జీవితంగా భావించే జగనన్న జిల్లాకు రానున్న తరుణంఆసన్నమైంది. ఎప్పుడు ఆయన...
21-09-2018
Sep 21, 2018, 12:52 IST
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రంలో నాలుగేళ్ల ప్రజా కంటక పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌...
21-09-2018
Sep 21, 2018, 06:53 IST
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న...
20-09-2018
Sep 20, 2018, 12:18 IST
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమై.. నేనున్నానంటూ బరోసా ఇస్తున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని..
20-09-2018
Sep 20, 2018, 09:04 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
20-09-2018
Sep 20, 2018, 07:08 IST
అన్నా చిట్టివలస జ్యూట్‌మిల్లు 2009లో లాకౌట్‌ అయింది. సుమారు 6,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తమ ప్రభుత్వం...
20-09-2018
Sep 20, 2018, 06:57 IST
జాబు కావాలంటే జగన్‌ రావాలి. జగనే నెక్ట్స్‌ సీఎం కావాలి అంటూ సాయిగణపతి పాలిటెక్నిక్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు...
20-09-2018
Sep 20, 2018, 06:51 IST
ప్రజా సంకల్పయాత్ర బుధవారం సెంచూరియన్‌ యూనివర్సిటీ ముందు నుంచి వెళ్లడంతో విద్యార్థులంతా జననేతతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పారామెడికల్, బీఎస్సీ...
20-09-2018
Sep 20, 2018, 06:47 IST
మాది కడప. వైఎస్సార్‌ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. దివంగత వైఎస్సార్‌ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి,...
20-09-2018
Sep 20, 2018, 06:42 IST
దివ్యాంగుల చట్టం 2016ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పెరుగుతున్న దివ్యాంగుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్‌ను 4 నుంచి 7...
20-09-2018
Sep 20, 2018, 06:38 IST
సాక్షి, విశాఖపట్నం: యువ తరంగం ఉప్పొంగింది. వజ్ర సంకల్పంతో దూసుకెళ్తున్న ఉద్యమాల సూరీడిని చూసేందుకు పోటెత్తింది. మీరే మా ఆశాకిరణం.....
20-09-2018
Sep 20, 2018, 04:11 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి...
20-09-2018
Sep 20, 2018, 02:57 IST
19–09–2018, బుధవారం  పప్పలవానిపాలెం క్రాస్, విశాఖ జిల్లా   యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా బాబూ? ఉదయం బస చేసిన ప్రాంతానికి దగ్గర్లోనే...
19-09-2018
Sep 19, 2018, 09:11 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు...
19-09-2018
Sep 19, 2018, 08:33 IST
నా పేరు కేవీఎన్‌ కార్తిక్‌. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. దివంగత వైఎస్సార్‌...
19-09-2018
Sep 19, 2018, 08:28 IST
ప్రజాసంకల్పయాత్ర నుంచి.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు సర్కారుకు దడ...
19-09-2018
Sep 19, 2018, 08:24 IST
సాక్షి, విశాఖపట్నం : ఆనందపురం ఆనంద పారవశ్యమైంది. ఆత్మీయత పంచింది. అభిమాన జల్లు కురిపించింది. కారుచీకటిలో కాంతిపుంజంలా దూసుకొస్తున్న సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 08:19 IST
‘బాబూ నాన్న పేరు నిలబెట్టాలి. ప్రజలంతా నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాముడిలాంటి పాలన అందించు’ అని ప్రజా సంకల్ప...
19-09-2018
Sep 19, 2018, 03:44 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులన్నీ రద్దు చేస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు...
19-09-2018
Sep 19, 2018, 03:28 IST
18–09–2018, మంగళవారం  ముచ్చెర్ల క్రాస్, విశాఖపట్నం జిల్లా బాబు పాలనలో విద్యా వ్యాపారులకు ఎర్ర తివాచి  మంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top