నీ రాకతోనే.. నవ వసంతం

People Sharing Their Problems In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం :‘పింఛనుకోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా టీడీపీ వాళ్లు మంజూరు చేయడం లేదు..కాలనీ ఇల్లు మంజూరు చేస్తామంటే ఉన్న ఇంటిని కూలగొట్టా... సీపీఎస్‌ విధానం రద్దుచేయాలని ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం... వందలాది ఎకరాలకు నీరందించే కొండకర్ల ఆవను కుదించి.. పర్యాటకం పేరుతో టీడీపీ నేతలు రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం..అంటూ సోమవారం పలువురు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. వారిని ఆప్యాయంగా పలుకరించిన జననేత రాబోయేది రాజన్నరాజ్యం.. నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రజాసంక్పలయాత్రలో ముందుకు సాగారు.

ఆవను కుదిస్తే నష్టపోతాం
 మా గ్రామపరిధిలో ఉన్న 1700 ఎకరాల కొండకర్ల ఆవను పర్యాటక అబివృద్ధి అంటూ 500 ఎకరాలకు కుదించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఆవపై ఆధారపడిన ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఉండదు. ఆవ ఆధారంగా 15 గ్రామాల ప్రజలు రెండు వేల ఎకరాల్లో చెరకు, వరి పండిస్తున్నారు. అంతేకాకుండా మూడు వందల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం గల ఆవలో నీరు–చెట్టు పథకంలో మట్టిని తవ్వి  రూ.30 కోట్లు ఆర్జించారు. ఈ విషయాన్ని జగనన్న దృష్టికి తీసుకువెళ్లా. మన ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల అభిప్రాయాలు సేకరించి వారి అభీష్టం మేరకు పర్యాటక అభివృద్ధి చేద్దామని భరోసా ఇచ్చారు.  –బుద్ద వెంకటసత్యరాము, కొండకర,్ల అచ్యుతాపురం మండలం

ఎన్నోసార్లు దరఖాస్తు చేశా
రెండు కాళ్లూ వంకర్లు తిరిగి నడవ లేని స్థితిలో ఉన్నాను. పింఛను కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా టీడీపీ వాళ్లు ఉద్దేశపూర్వకంగా తీసేస్తున్నారు. బాబూ నువ్వు అధికారంలోకి రాగానే పింఛను మంజూరు చేయాలని జగనన్నను వేడుకున్నా.– తేటకాళ్ల దుర్గినాయుడు,ఆవవరం, అచ్యుతాపురం మండలం

గూడు లేదయ్యా..
మా ఊళ్లో ఇల్లులేనోళ్లందరికీ ఇళ్లు ఇచ్చారు. నేను కూడా ఇల్లు కట్టుకుందామనుకుం టే స్కీం ఇల్లు ఇవ్వలేదు. పునాదేసుకుని ఉన్నాను. అర్హ త ఉన్నా నాకు స్కీం మంజూరు చేయలేదు. ఇల్లు కోసం అధికారులను అడిగితే తెలుగుదేశపోళ్లను అడగమంటున్నారు. వాళ్లు ఇంక ఇవ్వరు బాబు. నువ్వే నాకు నాయం చేయాలని జగన్‌బాబును కోరాం. మన ప్రభుత్వం రాగానే ఇస్తామని భరోసా ఇచ్చారు.
– యాండ్ర పెంటమ్మ,నడింపల్లి, అచ్యుతాపురం మండలం

సీపీఎస్‌ విధానంతో అన్యాయం
మేము కొండకర్ల ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నాం.  2004 తరువాత ఉద్యోగం పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం వల్ల అన్యాయం జరుగుతోంది. సీపీఎస్‌ రద్దుకు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్‌ రద్దు చేయాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం.   ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.–కొండకర్ల ప్రభుత్వ పాఠశాలఉపాధ్యాయులు

వైద్యంకోసం వెళితే పొమ్మన్నారు
నెల రోజుల క్రితం నడుస్తూ కాలుజారి పడ్డాను. ఎడమ చేయి విరిగింది. చికిత్స కోసం సర్కారు ఆస్పత్రికి వెళ్లాను.  ఆస్పత్రి యాజమాన్యం నాపై దయ చూపలేదు. సరైన చికిత్స అందించకుండా వెళ్లిపొమ్మన్నారు. దీంతో ఇంటికి వచ్చి నాటు మందులు వాడుతున్నాను. గాయం నయం కాలేదు. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యాన్ని గ్రామానికి వచ్చిన జగన్‌బాబుకు చెప్పుకున్నా. అయన ఎంతో ఆప్యాయంగా పలుకరించారు.– రెడ్డి రాములమ్మ, కుమ్మరిపాలెం, అచ్యుతాపురం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top