రేపల్లె రైల్వే స్టేషన్‌లో దారుణం

Passengers Beats Woman in Repalle Railway Station - Sakshi

సాక్షి, గుంటూరు : పిల్లల అపహరణ వదంతులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. చిన్నారులను కిడ్నాప్‌ చేస్తున్నారనే అనుమానంతో పలుచోట్ల అమాయకులపై స్థానికులు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం రేపల్లె రైల్వే స్టేషన్‌లో పిల్లలను అపహరిస్తుందేమోనన్న అనుమానంతో ఓ మహిళను ప్రయాణికులు చితకబాదారు. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top