లంకగ్రామాల్లో పర్యటించిన పామర్రు ఎమ్మెల్యే

pamarru MLA Kaile Anil Kumar Vists Lanka Villahes In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా: వరదలపై తాజా పరిస్థితిని అంచనా వేయడానికి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జిల్లాలోని లంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తోట్లవల్లూరు లంకగ్రామల్లో మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే, వల్లూరుపాలెం పునరావాసకేంద్రంలో బాధితులతో కలసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సహాయకచర్యలు చర్యలు చేపట్టామని, ప్రభుత్వం భాదితులకు అన్ని విధాలా అండగా ఉటుందని పేర్కొన్నారు. 

ఈ మేరకు పంట నష్టాన్ని అంచనావేసి రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాక వరద పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ బాధితులను పునరావాస కేంద్రాల్లోనే ఉంచి వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లంకగ్రామల్లో అంటువ్యాధులు ప్రభలకుండా శానిటేషన్ పై దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top