మాకు ఇంగ్లిష్‌ వద్దా?

పీఆర్‌ బాలుర హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మనబడి నాడు–నేడు సభలో మాట్లాడుతున్న విద్యార్థిని జ్ఞాన ప్రసన్న.చిత్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులు - Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై బాలలు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులో గురువారం నిర్వహించిన ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంలో చిన్నారులు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. తమ ఉజ్వల భవితను దృష్టిలో పెట్టుకుని గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

వుయ్‌ సపోర్ట్‌ యు సార్‌
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయనుండటం పట్ల స్టూడెంట్స్, పేరెంట్స్, పబ్లిక్‌.. హార్ట్‌ ఫుల్‌గా ఎంకరేజ్‌ చేస్తున్నారు. వుయ్‌ ఆర్‌ ఆల్‌ సపోర్ట్‌ యు సార్‌. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కలి్పంచేందుకు శ్రీకారం చుట్టడం సంతోషం కలిగిస్తోంది. ఏపీజే అబ్దుల్‌ కలాం విద్యా పురస్కార్‌ అవార్డులను ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఇవ్వడం మంచి నిర్ణయం. అన్నా.. ఈ పథకాలన్నింటికీ బడ్జెట్‌ సరిపోతుందా?
– జ్ఞానప్రసన్న, పదవ తరగతి, సంతనూతలపాడు జడ్పీ పాఠశాల

మాకు ఓటు హక్కు లేదని పట్టించుకోరా
ఎంతో మంది మహానుభావులు, పెద్ద పెద్దవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్లే సార్‌. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను చూస్తుంటే భయమేస్తోంది.  ఎంతో మంది రాజకీయ నాయకులు మా గురించి అసలు పట్టించుకోరు. ఎందుకంటే మాకు ఓటు హక్కు లేదు కాబట్టి. మా గురించి పట్టించుకున్న మీకు కృతజ్ఞతలు. వైఎస్సార్‌ జిల్లాలోని ట్రిపుల్‌ ఐటీలో మా అక్క స్వాతి చదువుతోంది. ఆ అవకాశం వచి్చనందుకు దివంగత నేత వైఎస్సార్‌ గారికి ధన్యవాదాలు.   
– హేమలత, ఎనిమిదవ తరగతి  

తెలుగు రాని లోకేష్, ఇంటర్‌ తప్పిన పవన్‌లే వద్దంటున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న మాకు కొంత మంది ఇంగ్లిష్‌ మీడియం వద్దంటున్నారు. మేమేం పాపం చేశాం? తెలుగు భాష రాని నారా లోకేష్, ఇంటర్‌ తప్పిన పవన్‌కల్యాణ్‌లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దంటున్నారు. వారు ఎందుకు ఇలా చెబుతున్నారో అర్ధం కావడం లేదు. వాళ్లు, వాళ్ల పిల్లలు మాత్రం లక్షలు, కోట్లు పెట్టి ఇంగ్లిష్‌ మీడియంలో చదవొచ్చు. మేం మాత్రం చదవకూడదా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఖచి్చతంగా అమలు చేయాలి. సార్‌.. మా నాన్న ఆటోడ్రైవర్‌. మీ (సీఎం) ద్వారా రూ.10 వేల సాయం అందింది.  
 – హారిక

వాళ్ల పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలి

ప్రైవేట్‌ స్కూళ్లలో చదివే వాళ్లే ఇంగ్లిష్‌ మీడియం చదవాలా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ల పిల్లలు ఏ పాఠశాలలో ఏ మీడియంలో చదువుతున్నారో ప్రకటించాలి. మా భవిష్యత్‌ కోసం ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి మంచి పని చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.  
– కీర్తి, పదవ తరగతి, పీవీఆర్‌ బాలికల హైసూ్కల్, ఒంగోలు

 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top