విద్యార్థి ప్రెజెంటేషన్‌పై స్పందించిన నాని, కేటీఆర్‌

Nani, Ktr responds to Geetham students presentaion - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

విశాఖపట్నం : గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఇచ్చిన  ప్రెజెంటేషన్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌, హీరో నానిలు స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో మై రోల్ మోడల్‌ అంశంపై తనకు రోల్ మోడల్‌లుగా ఉన్న కేటీఆర్‌, నానిలపై ఓ విద్యార్థి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. విద్యార్థులకు ఓ రాజకీయనాయకుడు ఆదర్శంగా నిలవడం చూస్తుంటూ ఆశ్చర్యంగానూ, చాలా ఆనందంగానూ ఉందని సదరు విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ పనితీరుతో మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను అని కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.

మై రోల్ మోడల్‌ ప్రెజెంటేషన్‌లో కేటీఆర్‌, నానిల ఫోటోలు పక్క పక్కనే ఉన్నాయి. ఇది గమనించిన కేటీఆర్‌ విద్యార్థి ట్వీట్‌కు బదులిస్తూనే హీరో నానిని కూడా ట్యాగ్‌ చేశారు.

వావ్‌, ఎక్కడ జరిగిందో గానీ, చాలా గౌరవంగా భావిస్తున్నాను. ప్రెజెంటేషన్‌లో నాకు మంచి కంపెనీగా నాని ఉన్నారు... అంటూ ట్వీట్ చేశారు.

దీనికి హీరో నాని కూడా స్పందించారు. నేను కూడా మీలానే గౌరవంగా భావిస్తున్నాను కేటీఆర్‌ బ్రదర్‌ అని ట్వీట్‌ చేశారు. ఆ ఫోటో చాలా ఆనందాన్నిచ్చింది... అంటూ కృతజ్ఞతలు తెలిపారు. నాని చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ లైక్‌ చేశారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top