మీ కంటికి దేశ ద్రోహుల్లా కనిపిస్తున్నామా?

Nandyal Muslim Youth Fires On TDP Government - Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా : ‘‘మీ కంటికి మేము దేశ ద్రోహులుగా కనిపిస్తున్నామా..? కానీ టీడీపీ వారిని ప్రశ్నించినందుకు మేము వాళ్లకు దేశ ద్రోహుల్లా కనిపించా’’మని నంద్యాల ముస్లిం యువకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. తమని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. స్టేషన్లు మార్చి తమని కొట్టారని తెలిపారు.

తాము ఏ పార్టీకి చెందిన వారము కామని అయినా వైఎస్సార్‌ సీపీ తమకు అండగా నిలబడిందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమకు ఏం కాదని భరోసా ఇచ్చారన్నారు. మైనారిటీలను అవమానపరిచిన టీడీపీ గెలవడానికి వీల్లేదని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top