పట్టు తప్పింది.. కాటు వేసింది

nag snake bite man in srikakulam - Sakshi

నాగుపామును పట్టే క్రమంలో వ్యక్తికి పాముకాటు

తప్పిన ప్రాణాపాయం 

జలుమూరు: లింగాలవలస పంచాయతీ కొత్త వీధికి చెందిన బాసిన చిన్నబాబు నాగుపామును పట్టేక్రమంలో కాటుకు గురయ్యాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తవీధిలోని ఓ ఇంట్లో నాగుపాము ఉందన్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి పామును బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇంతలో కార్తీక స్నానాలు చేసి వస్తున్న మహిళలు, అయ్యప్ప భక్తులు.. బుసలు కొడుతున్న నాగుపామును చూసి పాలుపెట్టి పూలతో పూ జలు చేశారు. 

ఇదే సమయంలో సంతోష్‌ అనే వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మద్యం మత్తులో తన రెండు చేతులతో పామును పట్టుకొని రోడ్డు అవతల వైపు విడిచిపెట్టాడు.  ఈ ప్రయత్నంలో సంతో ష్‌ చేతికి పాముకాటు వేసినట్లుగా గుర్తించలేదు. కొద్ది సేపటి తర్వాత చేతి వేలి నుంచి రక్తం రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్పందించిన సర్పంచ్‌ ప్రతినిధి దుంగ స్వామి బాధితుడిని తన బైకుపై నరసన్నపేట   ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యురాలు పద్మావతి వెంటనే చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి  తప్పించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాళం రిమ్స్‌కు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top