కలియుగంలో కని.. విని ఎరుగని వివాహ వేడుక

Mythological marriage in west godavari

సాక్షి, పెరవలి: పెళ్లి అంటే స్టేటస్‌గా భావించడం.. పలురకాల వంటకాలు.. బరాత్‌లు.. సంగీత్‌లతో హోరెత్తించేలా గ్రాండ్‌గా జరుపుకోవడం పరిపాటైంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో కళియుగంలోనే కని విని ఎరుగని వివాహం జరిగింది.  గ్రామానికి చెందిన శ్రీధర్‌ స్వామిజీ తన కూతురు పెళ్లిని దేవతల పరిణయంగా జరిపించారు. సాక్షాత్తూ.. విష్ణుమూర్తి వేషదారణలో పెళ్లి కొడుకు వినయ్‌.. లక్ష్మీదేవిగా పెళ్లికూతురు హర్షితను అలంకరించగా మిగతా కుటుంబ సభ్యులు దేవతామూర్తుల అవతారాల్లో హాజరై పెళ్లి నిర్వహించారు. ఈ పెళ్లి ఓ పౌరాణిక నాటకాన్నే తలిపించింది. అయితే ఇలా ఈ వివాహం జరిపించడం వివాదస్పదమైంది. 

స్వామీజీలు అంటే సర్వం త్వజించి.. తమ బోధనలతో ప్రజల అజ్ఞానపు పొరలను తొలగించి వారిని సన్మార్గం వైపు నడిపించే దేవుని ప్రతినిధులుగా అందరూ భావిస్తుంటారు.. కానీ ఈ శ్రీధర్ స్వామిజీ తనను తానే దైవంగా భావించి మానవుల పెళ్లిల్లో దేవతల పరిణయంలా వారి కుమార్తె పెళ్లి జరిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top