అక్కను చంపాడన్న అనుమానంతో....

Murder of Brother-in-law in East Godavari  - Sakshi

సాక్షి, బిక్కవోలు (తూర్పు గోదావరి): అక్కను చంపాడన్న అనుమానంతో బావను హత్య చేసి గోనె సంచిలో మూట కట్టి కాలువలో పడేసిన ఘటన మంగళవారం బిక్కవోలులో చోటు చేసుకుంది. భీమవరం సీఐ చంద్రం కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మామిడిశెట్టి నరసింహమూర్తి ఆర్‌ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నాడు. అతని మొదటి భార్య రాజరాజేశ్వరి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వారం రోజులుగా వెతుకుతున్నారు. రెండో భార్యతో కలసి ఉంటున్న బావను అక్కను వెతకడానికి రావాలని ఈ నెల 4వ తేదీన బావమరుదులు లక్ష్మీనారాయణ, నరసింహం కోరారు. కారులో బయలుదేరారు.

అక్కను బావే చంపేశాడని అనుమానించిన వారు మరో ముగ్గురితో కలసి బావను చంపి గోనెసంచిలో మూట కట్టి బిక్కవోలు కెనాల్‌ రోడ్డులో సున్నపు బట్టీల వద్ద కాలువలో పడేశారు. విచారణలో బావను తామే హత్య చేసినట్టు ఒప్పుకున్న వారు సంఘటన స్థలాన్ని చూపించారని సీఐ తెలిపారు. మంగళవారం బిక్కవోలు పోలీసుల సమక్షంలో భీమవరం సీఐ చంద్ర మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మండపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top