డిసెంబర్‌ 6లోగా హామీ అమలు చేయండి

డిసెంబర్‌ 6లోగా హామీ అమలు చేయండి

కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి ముద్రగడ లేఖ

 

కిర్లంపూడి: ‘బ్రిటిష్‌ పాలనలో మా జాతికి ఉన్న బీసీ రిజర్వేషన్లు తీసేయాలని అనుకున్నప్పటికీ, లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కాపులకు రిజర్వేషన్లు కొనసాగించా లంటూ ఆ సదుపాయాన్ని కాపాడిన మహానుభావుడు అంబేడ్కర్‌. ఆయన వర్ధంతి రోజైన డిసెంబర్‌ 6 నాటికి కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్‌ హామీని అమలు చేయాలి’ అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు.దాని ప్రతులను కిర్లంపూడిలో విలేకర్లకు విడుదల చేశారు. డిసెంబర్‌ 6లోగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే తమవద్ద రెండు ఆప్షన్లున్నాయని, సీఎం నిర్ణయాన్నిబట్టి ఏదో ఒకటి అమలు చేస్తామన్నారు.
Back to Top