మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు.. తెలుగు తమ్ముళ్ల హల్‌చల్‌

Mokshagna Birthday Celebrations TDP Student Activists Overaction - Sakshi

సాక్షి, కృష్ణా : బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకల్లో విద్యార్థి(తెలుగుదేశం) తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ర్యాలీ పేరుతో కళాశాలలోని వారిని భయబ్రాంతులకు గురిచేశారు. పోలీసుల మాటలు సైతం లెక్కచేయకుండా ఉన్మాదుల్లా రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. మోక్షజ్ఞ జన్మదినాన్ని పురష్కరించుకుని గురువారం కంచికచర్లలోని మిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థి (తెలుగుదేశం) తమ్ముళ్లు కేక్‌ కోసి.. బైక్‌, కార్లతో కోలాహలంగా గడిపారు. అంతటితో ఆగకుండా కంచికచర్ల మండల నాయకుడితో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో సైతం అడ్డదిడ్డంగా ప్రవర్తించారు. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి ర్యాలీతో పక్కనే ఉన్న అమితసాయి ఇంజనీరింగ్‌ కళాశాలలోకి ప్రవేశించారు. బళ్లు, కార్ల హారన్లతో కాలేజీలోని వారిని భయబ్రాంతులకు గురిచేశారు. వారిని అడ్డుకున్న విద్యార్థులు, అధ్యాపకులపై చేయిచేసుకున్నంత పని చేశారు. పోలీసు ఉన్నతాధికారి మాట కూడా వినకుండా ఉన్మాదుల్లా రెచ్చిపోయారు. వీరి తీరుతో విసిగిపోయిన ప్రజలు వారికి బుద్ధి చెప్పాలని పోలీసులను కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top