టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడమా?

టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడమా?

స్పీకర్‌ తీరుపై ఎమ్మెల్యే రోజా

 

సాక్షి, అమరావతి: ఎంతో గౌరవప్రదంగా భావించే స్పీకర్‌ హోదాలో ఉన్న కోడెల శివప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. అసెంబ్లీలో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, పుష్ప శ్రీవాణి, సునీల్, రాజన్నదొరలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.గతంలో స్పీకర్లుగా పని చేసిన నాదెండ్ల మనోహర్, సురేష్‌రెడ్డిలు ఎన్నడూ పార్టీ మీటింగ్‌లకు హాజరైన దాఖలాలు లేవని చెప్పారు. 
Back to Top