‘బీసీల దమ్ము బాబుకు చూపించాలి’

MLA Anil Kumar Yadav Slams Chandrababu In Kadapa - Sakshi

సాక్షి, కానగూడురు(కడప) : రాష్ట్రంలో అరాచకపాలనకు చరమగీతం పాడాలని 3 వేల కిలోమీటర్ల ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నట్లు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజాసంకల్పయాత్ర 7వ రోజులో భాగంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని కానగూడురులో బహిరంగ సభలో అనిల్‌ కుమార్‌ మాట్లాడారు. స్వతంత్ర భారతంలో బీసీలకు అండగా ఉన్న నాయకులు కేవలం ఎన్‌టీఆర్‌, వైఎస్‌ఆర్‌లేనని అన్నారు.

‘బీసీలందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. మన పిల్లలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల లాభ పడ్డారని గుర్తుంచుకోవాలి. నేడు మన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే కారణం వైఎస్సారే అన్న సంగతి మర్చిపోకూడదు. వైఎస్‌ బీసీల కోసం చేసిన దానికి రుణం తీర్చుకోవాల్సిన తరుణం వచ్చింది. బీసీల తమ వైపు ఉన్నారని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి. 2019 ఎన్నికల్లో బీసీ అందరూ ఒక్కటై వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం. బీసీల దమ్ము చంద్రబాబుకు చూద్దాం.

చంద్రబాబు బీసీలను వాడుకుంటున్నారు తప్ప.. సంక్షేమం కోసం చేసిందేమీ లేదు. బీసీల దెబ్బ మనం చూపించాలి బాబుకి. మనం జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే.. 45 సంవత్సరాలకే పెన్షన్‌ వస్తుంది. మన
పిల్లలు 10వ తరగతి పూర్తి చేసే వరకూ ప్రతి ఏడాది 15 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మన బిడ్డలు ఎప్పుడూ చేపలు పట్టాలి, కల్లు గీసుకోవాలి, కుల వృత్తులనే చేయాలనే ఆలోచన చంద్రబాబుది. బీసీలు
చదువుకోవడం ఆయనకు ఇష్టం లేదు. బీసీల అభ్యున్నతి కోరుకుంటున్నారు వైఎస్‌ జగన్‌. బీసీల కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసం ఓ కమిటీని వేశారు వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలో బీసీల కష్టసుఖాలను
తెలుసుకుని మేనిఫెస్టోను తయారు చేద్దామని చెప్పారు’అని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top