వైద్యులందరినీ విధుల్లోకి తీసుకోండి

Medical and health department directives to collectors - Sakshi

ప్రభుత్వ, ప్రైవేటు తారతమ్యం లేదు

ఆపత్సమయంలో అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది

వారి సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు

సాక్షి, అమరావతి: ఇది అత్యంత ఆపత్సమయం. కరోనా మహమ్మారి కోరలుచాచి విజృంభిస్తోంది. ఈ సమయంలో బాధితులకు సత్వరమే వైద్యమందించి, వారిని వైరస్‌ నుంచి విముక్తులను చేయడంలో వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారని, వీరి సేవలు ఇప్పుడు మరింత అవసరమని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ వైద్యులే కాదు ప్రైవేటు వైద్యులు కూడా కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొని సేవలందించాల్సిగా వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ వైద్యులున్నారో గుర్తించి వాళ్లందరి సేవలు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వైద్యులే కాకుండా నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, వలంటీర్లు, అసోసియేషన్‌ల సభ్యులు, యూత్‌క్లబ్‌లు ఇలాంటి వాళ్లందరినీ భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. 

వలంటీర్ల సేవలు కూడా..
► కోవిడ్‌ సేవల కోసం ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సభ్యులను తీసుకోవాలి.
► ఆయుష్‌ డాక్టర్లందరినీ తక్షణమే విధుల్లోకి రప్పించాలి.
► ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్‌ డాక్టర్లను, ఎన్‌సీసీ వలంటీర్లందరినీ వినియోగించుకోవాలి.
► కోవిడ్‌ సేవల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రక్షణ కిట్‌లు ప్రభుత్వం ఇస్తుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top