రాజ ఫలం.. ధర ఘనం

mango Price Hikes in West Godavari - Sakshi

ఆకాశాన్నంటుతున్న మామిడి పండ్ల ధరలు

గతేడాది కంటే భారీగా పెరిగిన వైనం

దిగుబడి తగ్గడమే కారణం

భీమవరం (ప్రకాశం చౌక్‌): పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి పండు కొనాలంటే సామాన్యుడికి భారంగా మారింది. ఏటా వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లను అంతా ఇష్టపడుతుం టారు. అలాంటి మామిడి పండ్ల ధర భారీగా పెరగడంతో మామిడి పండ్లను సామాన్యుడు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నాడు.

కాపు తగ్గడంతో పెరిగిన ధర
గతేడాదితో పోల్చుకుంటే ఈఏడాది మామిడి కాపు చాలా ఘననీయంగా తగ్గింది. దాంతో మామిడి పండ్లకు డిమాండ్‌ ఏర్పడింది. రైతు చెట్టు వద్ద వ్యాపారులకు కాయలను అధిక ధరకు విక్రయిస్తుంటే వ్యాపారులు వారి ఖర్చులు అన్నీ కలుపుకుని మరింత ధర పెంచి అమ్మడం వల్ల మామిడి కాయలను సామాన్యుడు రుచిచూసే భాగ్యం లేకుండాపోతోంది. గతేడాది కాపు బాగా ఉండడం వల్ల మామిడి పండ్ల ధర అందుబాటులో ఉంది. గతేడాదితో పోలిస్తే ఏఈడాది పరక (13 కాయలు) రూ.100 నుంచి రూ.150 అధికంగా ఉంది.

మొగల్తూరు పండ్లకు డిమాండ్‌
జిల్లాలో మామిడి పండ్లకు మొగల్తూరు ప్రాంతం పెట్టింది పేరు. పచ్చళ్లకు కూడా మొగల్తూరు చుట్టుపక్కల ప్రాంతాల కాయలకు బాగా గిరాకీ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌ల్లోకి మొగల్తూరు మామిడి పండ్లు రావడంతో డిమాండ్‌ మరింత పెరిగింది. అయితే వీటి ధరలు చూసి జనం కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top