నేడు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

నేడు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం


శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వ హించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ఉత్సవా లను పురస్కరించుకుని స్వామికి జరిగే ప్రత్యేక అభిషే కాలతో పాటు సామూహిక ఆర్జితసేవలు, హోమాలు, శాశ్వత టికెట్‌ కల్యాణోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త గురువారం ప్రకటించారు. ఈ నెల 24 మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం, 25న రథోత్సవం ఉంటాయన్నా రు. 18న తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, 21న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు  పట్టువస్త్రాలను çసమర్పిస్తారన్నారు.

Back to Top