స్వగ్రామానికి లోకేశ్వర్‌రెడ్డి దాతృత్వం

Lokeswar Reddy Donation to His Village in YSR Kadapa - Sakshi

ఉప్పరపల్లెలో రూ.7.5 లక్షలతోమంచినీటి ప్లాంటు ఏర్పాటు

ఒక్కో ఇంటికి రూ. వెయ్యి చొప్పున సీఎం సలహాదారు ఆర్థిక సాయం

చెన్నూరు  :  లాక్‌ డౌన్‌ సమయంలో ఇబ్బంది పడుతున్న తన సొంత ఊరి ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సాంకేతిక ప్రాజెక్టుల సలహాదారు తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ముందుకొచ్చారు. వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లె గ్రామంలో మంచినీళ్ల ప్లాంటును యుద్ధ ప్రాతిపదికన రూ. 7.5 లక్షల వ్యయంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో ప్రజలందరికీ ఉచితంగా శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేయనున్నారు. గ్రామంలో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేదలు, ఆర్థికంగా వెనుకబడిన 600 కుటుంబాలకు రూ. వెయ్యి (రూ.6 లక్షలు) చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. దీంతో పాటు జాతీయ రహదారి నుంచి గ్రామం లోపలి వరకూ 1.2 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశారు. లోకేశ్వర్‌రెడ్డి సోదరుడు  త్రిలోక్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. లోకేశ్వర్‌రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘అదరద్దు, బెదరద్దు.. నిర్లక్ష్యం అసలే వద్దు’ అన్న నినాదంతో తమ గ్రామంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top