‘స్థానికత’ను మరో రెండేళ్లు పొడిగించాలి

‘స్థానికత’ను మరో రెండేళ్లు పొడిగించాలి


సాక్షి, అమరావతి: వచ్చే జూన్‌ ఒకటితో ముగిసే ‘స్థానికత’ను మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పునర్విభజన చట్టంలోని సెక్షన్‌–108ను సైతం ఇంకో రెండేళ్లు పొడిగించాలని కోరనుంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయనుంది.స్థానికత అంశం 2017, జూన్‌ 1తో ముగుస్తున్నదని, అందువల్ల స్థానికతను మరో రెండేళ్లపాటు పొడిగించాలని, అలాగే రెండు రాష్ట్రాలమధ్య ఏవైనా ఇబ్బందులు తలెత్తితే రాష్ట్రపతికి తెలియజేసే వీలున్న సెక్షన్‌–108ను కూడా రెండేళ్లపాటు పొడిగించేలా కేంద్రానికి లేఖ రాయాలని సీఎం చంద్రబాబు వెలగపూడిలో జరిపిన సమీక్షలో నిర్ణయించారు.

Back to Top