36వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

jagan 36th day padayatra schedule - Sakshi

సాక్షి, అనంతపురం: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 36వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

ఇదే మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. బాదన్నపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు మల్కాపురం క్రాస్‌ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఎగురవేస్తారు. తర్వాత గొట్లూరు మీదుగా సాయంత్రం 5.30కు ధర్మవరం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగించి వైఎస్‌ జగన్‌ రాత్రి అక్కడే బస చేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top