హౌస్‌ ఫర్‌ ఆల్‌...  అంతా గోల్‌మాల్‌...

House Construction Irregularities In Vizianagaram Municipality - Sakshi

మునిసిపాలిటీల్లోని  ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు

రివర్స్‌ టెండరింగ్‌తో బయటపడనున్న బాగోతాలు

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిజమైన పేదలకు ఇళ్లు 

కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చిన విధానానికి చెల్లుచీటీ

నివేదికలు సిద్ధం చేస్తున్న మునిసిపల్‌ కమిషనర్లు

అందరికీ ఇళ్లు పథకాన్ని కొందరికే పరిమితం చేశారు. నిజమైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా... వారిని పక్కన పెట్టారు. బయటి మార్కెట్‌కంటే ఎక్కువ  మొత్తం చెల్లించి కాంట్రాక్టర్ల జేబులు నింపారు. ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం. ఒకే  ఒక్క నిర్ణయం ఈ అవకతవకలకు చరమగీతం పాడనుంది. అదే రివర్స్‌ టెండరింగ్‌.  దీనివల్ల తక్కువ మొత్తం తోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశం... పనిలోపనిగా  25 శాతం పనులు పూర్తికానివాటిని రద్దు చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు  మళ్లీ వాటిని కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే ఇళ్ల  నిర్మాణంపై పూర్తి నివేదికలను మునిసిపల్‌ కమిషనర్లు సిద్ధం చేస్తున్నారు.

బొబ్బిలి: పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకం గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురి పించింది. మార్కెట్‌ ధర కంటే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు చేసి వారికి లబ్ధి చేకూర్చింది. దీనిని గుర్తించిన నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసింది. ఇప్పుడు వాటిని నిర్ణీత ధరకు రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధమయిం ది. అంతే కాదు. ఇప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని, జోరందుకోనివాటికి సంబం ధిం చి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశించడంతో మున్సిపల్‌ కమిషనర్లు ఆయా లెక్కలను బేరీజు వేసుకుంటున్నా రు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం 25 శాతం దాటని వాటిని రాష్ట్ర ప్రభుత్వం నెలన్నర రోజుల కిందట నిలిపివేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు వాటి వివరాలు అందజేసిన తరువాత రివర్స్‌ టెండరింగ్‌కు ప్రభుత్వ చర్యలు తీసుకోనుంది.

విజయనగరం మినహా అన్నింటా అరకొరే...
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్క విజ యనగరం  మినహా మిగతా అన్ని చోట్లా 25 శా తం లోపునే నిర్మాణాలు జరిగాయి. వీటి నిర్మాణ బాధ్యతను విజయలక్ష్మి కంపెనీకి గత ప్రభుత్వం అప్పగించింది. మున్సిపాలిటీల్లో మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తమ అనుయాయులకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు జాబితా లు సిద్ధం చేశారు. దీంతో చాలా చోట్ల పట్టణపేదలు తమ ఆవేదనను వెలిబుచ్చినా ఫలితం లేకపోయింది. మరో వైపు అధిక ధరలకు సదరు కంపెనీకి కట్టబెట్టడంతో ప్రజా ధనం దుర్విని యోగమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రివర్స్‌ టెండరింగ్‌కు చర్యలు తీసుకోవడంతో తక్కువ మొత్తానికి పనులు పూర్తి కానున్నాయి.

నిర్మాణాలు కాకుండానే లబ్ధిదారుల ఎంపిక..
బొబ్బిలి మున్సిపాలిటీలో ఇళ్ల నిర్మాణానికి మున్సిపాలిటీకి బహుదూరంగా దారి లేకున్నా ఇళ్ల నిర్మాణాలను హుటాహుటిన ప్రారంభించా రు. అంతే కాదు కనీసం 18 శాతం నిర్మాణాలు కూడా పూర్తి కాకుండానే వాటిని అప్పటి మంత్రి ఆర్‌.వి.సుజయ్‌ కృష్ణ రంగారావు చేత టీడీపీ నాయకులు తూముల భాస్కరరావు, అప్పటి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అచ్యుతవల్లి తదితరులు లాటరీలు తీయించి లబ్ధిదారులకు ఇళ్లను కేటా యించేశారు. అయితే ఆ ఇళ్లు ఎక్కడున్నాయన్న విషయం అటు లబ్దిదారులకు, ఇటు కాంట్రాక్టర్లకు చివరికి నంబర్లు అందజేసిన అప్పటి మం త్రికి కూడా తెలియకపోవడం విశేషం. బొబ్బిలి లో 2481 ఇళ్లకు గాను 2448 ఇళ్లు మాత్రం గ్రౌం డ్‌ చేశారు. అందులో కేవలం 288 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి శ్లాబు, రూ ఫ్, ఫౌండేషన్, గ్రౌండ్‌ ఫౌండేషన్‌ వంటి స్థాయిల్లోనే ఉన్నా యి. ఇక్కడ ఇళ్లు నిర్మించినా ఇంకా రహదారి కూడా సిద్ధం కాలేకపోవడం విశేషం.

ఇతర చోట్లా అదే పరిస్థితి..
ఇళ్ల నిర్మాణాలు చాలా నెమ్మదిగా కాంట్రాక్టరు చేపడుతున్నారని అధికారులు గుర్తించారు. పా ర్వతీపురంలో కేవలం పునాదుల స్థాయిలోనే  పనులున్నాయి. అలా గే సాలూరులో 18 శాతం మాత్రమే పనులయ్యాయి. నెల్లిమర్లలో 21 శాతం మాత్రమే జరి గాయి. విజయనగరంలో  50 శాతం జరగడంతో దానిని కొనసాగించాలని నిర్ణయించారు. మిగిలిన చోట్ల పనులను నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటి నివేదికలను ఆయా అధికారులను కోరింది. మున్సిపల్‌ కమిషనర్లు ఇప్పుడు వాటి వివరాలను టిడ్కో అధికారులకు పంపిస్తున్నారు.

వివరాలు అడిగారు... పంపించాం.. 
హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకానికి సంబంధించిన ఇళ్ల వివరాలను ఉన్నతాధికారులు అడిగారు. వాటిని బ్లాకుల వారీగా నివేదిక ఇచ్చాం. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇళ్ల నిర్మాణాలను టిడ్కో అధికారులు ప్రారంభిస్తారు. 
– జి.బాలరాజు, టీపీఓ ఇన్‌ఛార్జి, బొబ్బిలి మున్సిపాలిటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top