చేనేత కార్మికులను ఆదుకోండి

Help For Handloom Workers in Srikakulam - Sakshi

శ్రీకాకుళం ,రాజాం:రాజాంలోని మల్లికార్జునకాలనీకి చెందిన చేనేత కార్మికులు నూలువడికే రాట్నాన్ని మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బహూకరించారు. అంతకాపల్లి వద్ద పాదయాత్రలో భాగంగా జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. ఏడాది పొడవునా పనికల్పించాలని, ఆప్కో బకాయిలు వెంటనే చెల్లించాలని, ఆప్కో నుంచి నూలు సొసైటీకి 40 శాతం రాయితీపై ఇవ్వాలని, ఆప్కో కొనుగోలు వస్త్రాలుపై జీఎస్టీ తొలగించాలని, చేనేత సంఘాలుకు డీసీసీబీ ద్వారా ఇచ్చిన క్యాష్‌ క్రెడిట్‌ రుణమాఫీ చేయాలని, చేనేత సంఘాలకు క్లస్టర్‌ పథకాన్ని అమలుచేయాలని, పక్కా గృహాల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, సంఘాల్లో నిల్వ ఉన్న దుస్తులను ఆప్కో ద్వారా కొనుగోలుచేయాలని, 150 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందించారు. వీటిపై పరిశీలన జరుపుతామని ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు చల్లా జయరాం, చప్పట్టి పెంటయ్య, చప్పట్టి కళావతి, ఓలేటి లక్ష్మి, ఆశపు సూర్యం,  మక్కం నీలకంఠం, జినగం ఈశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top