నా బిడ్డను ఆదుకోండి
శ్రీకాకుళం : నా బిడ్డ దినేశ్వర్రాయ్ 18 ఏళ్లగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇప్పటికే రూ.25 లక్షలు ఖర్చుతో రెండుసార్లు ఆపరేషన్లు చేయించాం. అయినా ఆరోగ్య పరిస్థితిలో మెరుగు లేదు. కళ్ల ముందే బిడ్డ ఆరోగ్యం రోజురోజుకూ దిగజారుతుంటే భరించలేకపోతున్నామన్నా. ఆయుర్వేదం మందులకు రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. నా కుమారుడ్ని ఆదుకోండన్నా..– కూన రోజా, చాపర, మెళియాపుట్టి మండలం