భారీ వర్షం.. పిడుగుల బీభత్సం


విజయనగరం కంటోన్మెంట్: పెద్ద శబ్దంతో వచ్చిన ఉరుములు, మెరుపులతో   జిల్లా వణికింది.  గుర్ల, విజయనగరం ప్రాంతా ల్లో పిడుగుల బీభత్సానికి ఒకరు మృతి చెందగా 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థి తి విషమంగా ఉంది. జిల్లాలో శని వారం మధ్యాహ్నం వరకూ తీ వ్రమైన ఎండ కాసింది. ఒంటి గంటన్నర తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  దట్టమైన మేఘాలు ఆవరించాయి. జిల్లా మొత్తం నల్ల మబ్బులు కమ్ముకుని, అంధకారం అలముకుంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురి సాయి.

 

 విజయనగరం మండలం సుంకరిపే ట పంచాయతీ మరిశర్లకు చెందిన సుంకరి శివ(26), తన తల్లి మృతి చెందడ ంతో  శ్మశాన వాటికలో దహనసంస్కారాలు నిర్వహించా రు. ఈ నేపథ్యంలోనే కర్మకాండలు నిర్వహించేందుకు మరో సారి శ్మశాన వాటికకు వెళ్లిన శివ, వారి బంధువులపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో కలిపి శ్మశాన వాటికకు వెళ్లిన ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుమల ఆస్పత్రిలో  వైద్యం సేవలందిస్తున్నారు.  మిగతావారిలో ఒకర్ని ఎమ్మార్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు. మరో నలుగురిని జనరల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.    గుర్ల మండలం కొండగండ్రేడులో ఆవులను మేపుతున్న ఎం రామస్వామి, బి కృష్ణ, ఎం గోవిందల సమీపంలో  పెద్ద శబ్దంతో పిడుగులు పడ్డాయి. దీంతో వారు ముగ్గురూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.   

 

 బంధువులు, గ్రామస్తులు వారిని విజయనగరంలోని కేంద్ర ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.   రామస్వామి, కృష్ణల పరిస్థితి విషమంగా ఉంది.   మధ్యాహ్నం వరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పెద్దపెద్ద శబ్దాలతో పిడుగులు పడడంతో  ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎస్ కోటలో దాదాపు రెండున్నర గంటల పాటు భారీ వర్షం కురిసింది.  ఎల్.కోట,కొత్త వలస, వేపాడ మండలాల్లో కూడా వర్షాలు పడ్డాయి.   నెల్లిమర్ల నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలపాటు కుండపోతగా వర్షం కురిసింది.   సాయంత్రం వరకూ చిరుజల్లులు కురుస్తునే ఉన్నాయి.   చీపురుపల్లిలో సాయంత్రం వర్షం పడింది. గజపతినగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పార్వతీపురం, కురుపాం, సాలూరు, బొబ్బిలి ప్రాంతాల్లో  సాయంత్రం నుంచి చిరుజల్లులు ప్రారంభమయ్యాయి.

 

 193 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

 జిల్లావ్యాప్తంగా శనివారం 193 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈనెలలో  సాధారణ వర్షపాతం 1894.5 మిల్లీమీటర్ల కాగా, ఇప్పటి వరకూ 3,905.8 మిల్లీమీటర్లు  నమోదైంది.  ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top