కుమ్మరించింది

కుమ్మరించింది - Sakshi


- విశాఖలో 6 సెం.మీల వర్షం

- మరో రెండ్రోజులు వానలు

- అప్రమత్తంగా ఉండాలని

- మత్స్యకారులకు సూచన

సాక్షి, విశాఖపట్నం:
వాన కుమ్మరించింది. రెండు రోజుల క్రితం మొదలైన వర్షం కొనసాగుతూనే ఉంది. అటు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇటు నైరుతి రుతుపవనాల ప్రభావం వెరసి విశాఖ శుక్రవారం కూడా తడిసి ముద్దయింది. వేకువజాము నుంచి రాత్రి వరకు భోరున వర్షం కురుస్తూనే ఉంది. ఒకేసారి కుంభవృష్టిలా కాకుండా ప్రశాంతం గా పడుతూనే ఉంది. మధ్యమధ్యలో తెరపిస్తూ, తెరలు తెరలుగా కురిపించింది. రాత్రయ్యే సరికి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పగలంతా తేలికపాటి ఈదురుగాలులు వీచాయి. అదేపనిగా కురుస్తున్న వర్షానికి జనం అవస్థలు పడ్డారు. ముసురు పట్టినట్టున్న వాతావరణంతో రోడ్ల పక్క ఉపాధి పొందే చిల్లర వర్తకులు శుక్రవారం కూడా పెద్దగా తమ దుకాణాలు తెరవలేదు. అత్యవసర పనులున్న వారు తప్ప ఇతరులు ఇళ్ల నుంచి అంతగా బయటకు రాలేదు. దీంతో ని త్యం రద్దీగా ఉండే రోడ్లు కూడా జనసంచారం లేకుం డా బోసిపోయాయి. ప్రయాణికులు లేక చాలా బ స్సులు ఖాళీగానే కనిపించాయి. ఉద్యోగులు, విద్యార్థులు

 

రెయిన్‌కోట్‌లు, గొడుగులతో వెళ్లాల్సి వచ్చింది. వర్షానికి ఎప్పటిలానే రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో ద్వి చక్ర వాహన చోదకులు రోడ్లపై గోతు ల్లో చిక్కుకుని ఇబ్బందుల పాలయ్యా రు. మోటార్ బైకుల్లోకి నీరి చేరిపోవడంతో పలుచోట్ల మొరాయించాయి. ఇటీవల వేసిన తారు రోడ్లు ఈ వర్షాలకు కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో 6సెంటీమీటర్ల  వర్షపాతం నమోదయింది. రోజంతా వర్షం కురవడంతో చల్లదనం పరచుకుంది. దీంతో శీతాకాలంలో మాదిరిగా 29 డి గ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.

 

మన్యాన్ని ముంచెత్తిన వాన 199.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

పాడేరు:
మన్యాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి.  కొంత వ్యవధినిస్తూ కుండపోతగా వర్షం కురుస్తోంది. మూడు రోజులుగా ఏజెన్సీలో ఇదే పరిస్థితి. దీంతో పౌర జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలతో పాడేరు పట్టణంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా వర్షపునీరు పొంగి ప్రవహిస్తోంది. కొండ గెడ్డలు, వాగులో నీటి జోరు ఉధృతమైంది.  ఏజెన్సీలో శుక్రవారం 199.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు 37.4 మిల్లీమీటర్లు, పెదబయలులో 20.2, హుకుంపేటలో 12.6, డుంబ్రిగుడలో 26.4, అరకులోయలో 9.8, అనంతగిరిలో 27.4, పాడేరులో 27.4, జి.మాడుగులలో 19.2, చింతపల్లిలో 22.2, జీకేవీధిలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

ఖరీఫ్‌కు అనుకూలం:ఖరీఫ్‌లో వ్యవసాయ పనులకు ఈ వర్షాలు అనుకూలిస్తాయని ఏడీ రవీంద్రనాథ్ తెలిపారు. వరి నారుపోతలను పొలాలు సిద్ధం చేసుకోవచ్చని, వర్షాలు తగ్గాక నారుపోతలు చేపట్టాలని సూచించారు. మొక్కజొన్న మొదటి కలుపు తీసుకోవాలని, పసుపు, అల్లం మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కాయగూరల పంటలకు వర్షాలు అనుకూలిస్తాయన్నారు. విత్తనాలు నాటుకో డానికి అనుకూలమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top