'స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది'

Governor Came As Chief Guest For  Seventh Convocation Of The JNTU Kakinada - Sakshi

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచంద్‌

సాక్షి, కాకినాడ : కాకినాడ జేఎన్టీయులో ఏడవ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌, యునివర్సిటీ కులపతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉంది. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో విద్యార్దులు భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని, ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. గాంధీ కలలుగన్న భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు  అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్‌ బిహెచ్‌ఈఎల్‌ మాజీ సీఎండీ ప్రసాదరావుకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 119 మంది విద్యార్థులు గవర్నర్‌ చేతుల మీదుగా పీహెచ్‌డి పట్టాలు అందుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top