ప్రభుత్వ పాఠశాలలను బతికించండి

Government School Teachers Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం  : సకాలంలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి రేషనలైజేషన్‌కు గురవుతున్నాయి. అందువలన ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిగా మౌలిక వసతులు కల్పించి మూడేళ్ల తరువాతే రేషనలైజేషన్‌ చేపట్టాలి. తెలుగు, ఇంగ్లీషు మీడియమ్‌ విద్యార్థులకు వేర్వేరుగా ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలి. హెల్త్‌కార్డుల ద్వారా చెన్నై, హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరులలో కూడా వైద్యం అందేలా చూడాలి. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు కేటాయించరాదు. మాడుగుల, చోడవరం, అరకు, పాడేరు నియోజకవర్గాలలో ఒక్క వృత్తి విద్యా కళాశాల కూడా లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు కాకినాడ, విశాఖ నగరాలకు వెళ్లవలసి వస్తుందని జగన్‌మోహన్‌రెడ్డికి యూటీఎఫ్‌ తరపున చోడవరం రీజినల్‌ కన్వీనర్‌ శరగడం జగ్గారావు, కోశాధికారి వి.ఎస్‌.ప్రకాష్‌ వినతిపత్రం అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top