జిల్లాలో ఐదేళ్ల టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయం..

The Five Year TDP Rule is The Rowdy Kingdom in the District - Sakshi

సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఐదేళ్ల టీడీపీ పాలన జిల్లాలో రౌడీ రాజ్యాన్ని తలపిస్తోంది. అధికార బలంతో తెలుగు దేశం నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. అక్రమాలు, అన్యాయాలను నిలదీసిన వారిని బెదిరించడం.. అక్రమ కేసులతో జైలుకు పంపడం.. అప్పటికీ మాట వినకపోతే అంతు చూడటం.. వారి నైజం. ఇందుకు నిదర్శనంగా జిల్లాలో ఎన్నో ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులను సైతం వీరు వదలలేదు. చెప్పినట్లు చేయకపోతే బదిలీ చేయడంతో పాటు దాడులకు పాల్పడ్డారు. స్వార్థ రాజకీయాలకు పేదలపై ఉక్కుపాదం మోసిన ఘనులు ఉన్నారు. చివరకు గ్రామాలకు, పొలాలకు నీటి సరఫరా నిలిపివేయడం.. మహిళలను లైంగికంగా వేధించడం.. దాడులు చేయడం.. ఇలా ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. రాక్షస పాలనలో జిల్లాలో జరిగిన ఘటనలు మచ్చుకకు కొన్ని..  

రాజకీయ కుట్ర.. నారాయణరెడ్డి హత్య
పత్తికొండ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జిగా ఉన్న చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడిని కృష్ణగిరి మండల కేంద్ర సమీపంలో 2017 మే 21వ తేదీన ప్రత్యర్థులు అతి దారుణంగా హత్య చేశారు. నారాయణరెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ కృష్ణమూర్తి పత్తికొండ నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తనయుడు కేఈ శ్యామ్‌బాబును వారసత్వంగా అరంగ్రేటం చేసేందుకు సిద్ధం చేసుకున్న తరుణంలో నారాయణరెడ్డికి  ప్రజల నుంచి ఆదరణ రావడం, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలుస్తారనే ప్రచారం జరిగింది.
దీంతో కేఈశ్యామ్‌బాబు, కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కుమార్తె బొజ్జమ్మ, వెల్దుర్తి అప్పటి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌తో కుమ్మక్కై నారాయణరెడ్డిపై ప్రత్యర్థులను ఉసిగొలిపి హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. 

కత్తులతో వీరంగం.. 


ఏడాదిన్నర క్రితం డోన్‌లో మునిసిపల్‌ షాపుల టెండ ర్లను దక్కించుకునేందుకు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేశన్నగౌడ్‌ అనచరులు వీరంగం సృష్టించారు. మునిసిపల్‌ ఆవరణలోనే వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పోస్టు ప్రసాదు, సుధాకర్‌యాదవ్‌పై రాడ్లు, కత్తులతో దాడి తీవ్రంగా గాయపరచారు. అప్పట్లో ఏకంగా పోలీసులు దాడి చేసిన కేశన్న గౌడ్‌నే తమ వాహనంలో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.  

నంద్యాలలో అరాచకం 
నంద్యాలలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన మరుసటి రోజు టీడీపీ నాయకుడు అభిరుచి మధు హల్‌చల్‌ సృష్టించాడు. ఎమ్మెల్సీ హోదాలో వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కౌన్సిలర్‌ మృతి చెందడంతో మట్టి ఇచ్చి వెనక్కి వస్తుండగా సూరజ్‌ హోటల్‌ సమీపంలో కారుతో అడ్డగించి కత్తితో దాడి చేయబోయాడు. ఈ ఘటనలో గాయాలతో శిల్పా చక్రపాణిరెడ్డి బయట పడ్డారు.  


సూరజ్‌ హోటల్‌ వద్ద ప్రజలు చూస్తుండగా పోలీసుల సమక్షంలో వేటకొడవలి పట్టుకొని వీరంగం సృష్టిస్తున్న టీడీపీ నాయకుడు అభిరుచి మధు (ఫైల్‌) 

- నంద్యాలలో వైఎస్‌ఆర్‌సీపీ మునిసిపల్‌ కౌన్సిలర్లపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఉప ఎన్నికల సమయంలో కౌన్సిలర్‌ అమృతరాజ్‌పై పోలీసుల సాయంతో కేసు పెట్టించారు. ఐదు నెలల క్రితం 18వ వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తున్న వార్డు కౌన్సిలర్‌ సుబ్బారాయుడుపై ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులు అయిల్‌ భాస్కరరెడ్డి నాగేశ్వరరెడ్డి, ఎల్లా గౌడ్‌లు దాడి చేశారు. ∙జాకీర్‌ హుస్సేన్‌ అనే కౌన్సిలర్‌ తన వార్డులో పింఛన్లను పంపిణీ చేయరాదని దౌర్జన్యం చేయడంతోపాటు కేసు పెట్టించిన ఘనత టీడీపీ నాయకులకే దక్కుతుంది.  
- నంద్యాల మండలం పొన్నాపురం గ్రామంలోని మసీదు స్థలంపై ఎమ్మెల్యే బుడా రాజశేఖరరెడ్డి అనుచరుడు బుడ్డా శ్రీకాంత్‌ కన్నుపడింది. దాదాపు ఎకరా ఉన్న ఆ స్థలంలో అప్పటికే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడం, ఖురాన్‌ చదవడం వంటివి చేసేవారు. అయితే గతేడాది నవంబర్‌లో శ్రీకాంత్‌రెడ్డి స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి ఖురాన్, ఇతర వస్తువులను బయటకు పడేశారు.  
- నంద్యాల మండలం చాపిరేవులలో టీడీపీ నాయకుడు భూపాల్‌రెడ్డి దౌర్జన్యం చేశారు. లక్ష్మీదేవి అనే మహిళ పేరిట ఉన్న ఎకరా భూమిని లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆమె అడ్డుకుంది. ఈ విషయాన్ని కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ప్రజాదర్బార్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. 

మరిన్ని వార్తలు

17-03-2019
Mar 17, 2019, 12:14 IST
వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): ప్రతిసారి కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి మరుసతి...
17-03-2019
Mar 17, 2019, 11:55 IST
సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం సమీపంలో ఉన్న కొండప్రాంతంలో ఒడిశా  రాష్ట్రానికి చెందిన 10గిరిజన కుటుంబాలను వైకుంఠపురం గ్రామానికి...
17-03-2019
Mar 17, 2019, 11:42 IST
సాక్షి, ఆళ్లగడ్డ : నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇందూరు ప్రభాకరరెడ్డి, ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల...
17-03-2019
Mar 17, 2019, 11:35 IST
సాక్షి, బోట్‌క్లబ్‌: ముందుగొయ్యి.. వెనుక నుయ్యి చం దంగా తయారయ్యింది కాకినాడ సిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు పరిస్థితి....
17-03-2019
Mar 17, 2019, 11:35 IST
సాక్షి, అనంతపురం: రుణమాఫీ అనగానే రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. రుణమాఫీ హామీ ప్రకటించే నాటికి రుణాలు...
17-03-2019
Mar 17, 2019, 11:24 IST
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌ : శ్రీకాకుళం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసానికి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు...
17-03-2019
Mar 17, 2019, 11:04 IST
సాక్షి, అమరావతి :‘‘ఆహా.. మన ఎలక్షన్లు మొదటివిడతే అయిపోవడం ఎంత లాభం తెలుసా?’’ అన్నాను నేను.   ‘‘ఏం లాభం.. ఎవరికి...
17-03-2019
Mar 17, 2019, 10:59 IST
సాక్షి, అనంతపురం అర్బన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైనది. ప్రజావ్యతిరేక పాలకుల పాలిట సింహ స్వప్నం. అవినీతి ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే...
17-03-2019
Mar 17, 2019, 10:48 IST
సాక్షి, ఆకివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరువల్లే కొల్లేరు సమస్య పరిష్కారం కావడం లేదని, దీనికోసం ఈ సర్కారు తీసుకున్న ప్రత్యేక...
17-03-2019
Mar 17, 2019, 10:46 IST
సాక్షి,  అమరావతి :ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజలకు పెద్ద నోట్లు లభించడం లేదు. ఓట్ల కొనుగోలు కోసం రాజకీయ నాయకులు పెద్ద నోట్లను...
17-03-2019
Mar 17, 2019, 10:43 IST
సాక్షి, కాకినాడ: అమలాపురం లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చింతా అనురాధ పేరును పార్టీ అధిష్టానం శనివారం రాత్రి...
17-03-2019
Mar 17, 2019, 10:30 IST
సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్‌ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది...
17-03-2019
Mar 17, 2019, 10:25 IST
టీడీపీ, బీజేపీ బంధం ముస్లింలను ఏనాడూ స్థిరంగా ఉండనివ్వలేదు. ఒకసారి వాజ్‌పేయి, మరోసారి  మోదీ పుణ్యామా అంటూ అధికారంలోకి వచ్చిన...
17-03-2019
Mar 17, 2019, 10:22 IST
సాక్షి, ద్వారకాతిరుమల : గిరమ్మ ఎత్తిపోతల పథకం ఆత్మ ఘోషిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు చుక్క నీరందించలేకపోయానని ఆవేదన చెందుతోంది. ఆ...
17-03-2019
Mar 17, 2019, 10:16 IST
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోనసీమలోని అంబాజీపేటకు విచ్చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం...
17-03-2019
Mar 17, 2019, 10:08 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశాంతతకు రాజకీయ చైతన్యానికి ప్రతీక.. పల్లెసీమలకు నిలయం.. అదే పశ్చిమగోదావరి జిల్లా.. అయితే జిల్లాలో రాజకీయ...
17-03-2019
Mar 17, 2019, 10:04 IST
ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. ఎలాగన్నది అనవసరం. ఇదీ చంద్రబాబు సిద్ధాంతం. తలపడిన  ప్రతి ఎన్నికలోనూ ఏ తొండాట ఆడైనా సరే...
17-03-2019
Mar 17, 2019, 09:59 IST
సాక్షి, అనంతపురం సిటీ: నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యల్లో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడి హస్తముందని, ఆయనను తక్షణమే అరెస్టు...
17-03-2019
Mar 17, 2019, 09:58 IST
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ 15 మందితో తమ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. మరో...
17-03-2019
Mar 17, 2019, 09:54 IST
సాక్షి, అమరావతి: దేశాన్ని.. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన మర్రి చెట్టులాంటి కాంగ్రెస్‌ పార్టీ స్వీయ తప్పిదాలతో మరణ శాసనం...

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top