వయస్సు మూడేళ్లు.. ఐదు ‘ఆధార్‌’లు

వయస్సు మూడేళ్లు.. ఐదు ‘ఆధార్‌’లు


రామచంద్రపురం (తూర్పు గోదావరి): ఒక బాలుడి పేరు మీదుగా ఐదు వేర్వేరు నంబర్లతో ఐదు ఆధార్‌ కార్డులు మంజూరైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని కొత్తూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణంలోని కొత్తూరుకు చెందిన మడికి లక్ష్మీసుజాత తన మూడేళ్ల కుమారుడు ధర్మకు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేయించింది.



శుక్రవారం పోస్టులో బాలుడి పేరుతో ఐదు వేర్వేరు నంబర్లున్న ఐదు ఆధార్‌ కార్డులు వచ్చాయి. బాలుడు ధర్మ పేరు, 2–2–16, కొత్తూరు అనే చిరునామాలు ఒకే విధంగా అన్నింటి మీదా ఉన్నాయి. ఆధార్‌ నంబర్లు మాత్రం వేర్వేరుగా ఉండడంతో ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతైంది. ఇన్ని నంబర్ల మధ్య ఏ ఆధార్‌ నంబర్‌ని పరిగణనలోకి తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.

Back to Top