విజయవాడలో అగ్ని ప్రమాదం 

Fire Accident in Vijayawada - Sakshi

విజయవాడ: నగరంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. బీసెంట్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌  కారణంగా మంటలు చెలరేగాయి.  దీంతో షాపులోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 10 లక్షల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం.  రెండో అంతస్థులో ఉన్న దుకాణంలో మంటలు ఎగసి పడటంతో కాంప్లెక్స్‌లోని వ్యాపారులు ఆందోళన చెందారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top