శ్రీవారి ఆలయంలో అపచారం

Festive idol that touches the ground at TTD - Sakshi

నేలను తాకిన ఉత్సవ విగ్రహం

తిరుమల: తిరుమల స్వామి ఆలయంలో మహాపచారం జరిగింది. సాక్షాత్తు కలియుగ నాథుడైన మలయప్ప స్వామి విగ్రహం నేలకు తాకి  అపశృతి సంభవించింది. సహస్రదీపాలంకారణ సేవ అనంతరం  సాయంత్రం శ్రీవారి ఆలయంలో  బంగారు వాకిలి నుంచి గర్భాలయంకు అర్చక స్వాములు తీసుకువెళుతున్న సందర్భంలో, అర్చకుని కాలు మడత పడి, నేలపైకి జారడం వలన  మలయప్పస్వామి విగ్రహం నేలను తాకింది.

ప్రధాన అర్చకులు, ఆగమసలహాదారు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహదారు  ఎన్‌ఎకె.సుందరవరద భట్టాచార్యులు ఆలయానికి హుటాహుటీæన చేరుకొని ప్రాయశ్చిత్తంగా శ్రీవారి యాగశాలలో  వైఖానస ఆగమోక్తంగా లఘుసంప్రోక్షణ నిర్వహించారు.  స్వామి విగ్రహాన్ని జారవిడిచిన అర్చకుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top