నాలుగేళ్ల కుమార్తెపై తండ్రి వికృతచేష్టలు

father Molestation On Daughter - Sakshi

–తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

అవనిగడ్డ: కన్నతండ్రే ఆ చిన్నారిపట్ల కర్కశంగా వ్యవహరించాడు.  చాక్లెట్స్‌ ఎరచూపి అభంశుభం తెలియని కన్నకూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోదుమూడికి చెంది న శిర్విశెట్టి కోటి నాగేశ్వరరావు కైకలూరు మండలం వింజరం లాకులు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మోదుమూడికి చెందిన మారుతికి కోటి నాగేశ్వరరావుతో 2002లో వివాహం జరిగింది. 9 సంవత్సరాల క్రితం కుమారుడు, నాలుగేళ్ల క్రితం కుమార్తె జన్మించింది. భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య, భర్తల మధ్య  తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త వికృత చేష్టలకు విసిగిపోయిన భార్య రెండేళ్ల నుంచి భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఇద్దరు పిల్లలను తనదగ్గరే ఉంచుకుని చదివించుకుంటోంది.

చాక్లెట్స్‌ ఇస్తానని చెప్పి.. 
మోదుమూడిలోని ఎంపీయూపీ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల కుమార్తెను చూసేందుకు తండ్రి కోటి నాగేశ్వరరావు శనివారం స్కూల్‌కి వెళ్లాడు. కొద్దిసేపు కూతురితో మాట్లాడిన అతను చాక్లెట్స్‌ ఇప్పిస్తానని చెప్పి బైక్‌పై బయటకు తీసుకువెళ్లి కుమార్తె పట్ల వికృత చేష్టలకు ఒడిగట్టాడు. అనంతరం ఆ చిన్నారిని స్కూల్‌కి తీసుకెళ్లి వదిలేశాడు. ఇంటికొచ్చాక మూత్రం పోసుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి తీవ్ర మంటతో ఏడ్వడం, కడుపునొప్పితో బాధపడటంతో ఏమైందని ప్రశ్నించిన ఆతల్లికి కూతురు చెప్పడంతో బాలికను అవనిగడ్డలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లింది. జరిగిన విషయం చెప్పడంతో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లమని వారు సూచించారు. మంగళవారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బుధవారం చిన్నారిని పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మృగాళ్లపై కఠిన చర్యలు: నన్నపనేని
మచిలీపట్నంటౌన్‌: అభంశుభం తెలి యని చిన్నారులపై కూడా వికృతచేష్టలకు పాల్పడుతున్న మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. మోదుమూడిలో తం డ్రి చేత వికృతచేష్టలకు గురై స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొం దుతున్న బాలికను బుధవారం ఆమె పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం. జయకుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నన్నపనేని మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఆర్డీవో ఉదయభాస్కరరావు, డీఎస్పీ మహబూబ్‌బాషా, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం. జయకుమార్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top