ఐక్లిక్‌..నో క్లిక్‌!

Eye Click Machines Not Working Properly In Prakasam - Sakshi

ప్రకాశం, ఒంగోలు: ఐ క్లిక్‌ ఉంటే మనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయాలంటే పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఉన్నతాధికారి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఫిర్యాదులే కాకుండా సమస్యను, రహస్య సమాచారాన్ని సైతం ఐక్లిక్‌ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. చేసిన ఫిర్యాదుకు సంబంధించి ప్రింట్‌ కూడా వస్తుంది. ఇదంతా ఐక్లిక్‌ ఘనతే. అయితే స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోని ఐక్లిక్‌ మెషీన్‌ మరమ్మతులకు గురై దాదాపు నెలకావొస్తోంది. మెషీన్‌ దుమ్ము,.ధూళితో అపరిశుభ్రంగా తయారైంది. తలుపులు ఓపెన్‌ చేసి ఉంచినా గేటు మీద మాత్రం మెషీన్‌ పనిచేయడం లేదనే చిన్న పత్రం మాత్రం అంటించారు. కానీ దీని కోసం అలవాటు పడిన వారు మాత్రం బస్టాండ్‌కు రావడం, ఐక్లిక్‌ గురించి ఔట్‌ పోస్టు సిబ్బందిని విచారించడం, పనిచేయడం లేదని తెలుసుకొని ఉసూరుమంటూ వెళ్లిపోవడం జరగుతోంది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఆంధ్రాబ్యాంకు సహకారంతో మెషీన్లను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. మరమ్మతులు పూర్తయి మళ్లీ ఈ మెషీన్‌ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో ఉన్నతాధికారులే సెలవివ్వాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top