ఏడాది తర్వాత బయటకొచ్చింది

Elderly Woman Meets YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం : మా అమ్మమ్మ పేరు ఆళ్ల చినతల్లి. వయస్సు 85 ఏళ్లు. ఇంటిపట్టునే ఉంటూ పెట్టిం ది తింటూ కాలక్షేపం చేస్తోంది. ఏడాదిగా గుమ్మం దాటి బయటకు వచ్చింది లేదు. ఊళ్లోకి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కొడుకు జగనన్న వస్తున్నాడని చెప్పా. అంతే నన్ను అక్కడకు తీసుకెళ్లు. ఆ బాబును చూడాలి. ఆశీర్వదిస్తానని ఒకటే గొడవ చేసింది. అడుగు తీసి అడుగు వేయలేని మా అమ్మమ్మ ఆ బాబును చూసేందుకు ఉత్సాహంగా ఎవరి ఊతం లేకుండానే రోడ్డు మీదకొచ్చేసింది. జగన్‌ను చూసి ఏమడుగుతావ్‌ అని ప్రశ్నిస్తే..బాబూ నువ్వు చల్లంగుండు..మీ నాయనలా మంచి పాలన అందిస్తావ్‌ అదే మా అందరి ఆశ అని బదులిచ్చింది. అనంతరం జగన్‌ను కలిసి ఆశీర్వదించి ఆరోగ్యం జాగ్రత్త అంటూ చెప్పింది.

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించాలి
నాకు రెండెకరాల భూమి ఉంది. చెరుకు పంట వేస్తా. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ మూసివేయడంతో మా ప్రాంత చెరుకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏటా పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదు. అప్పులపాలైపోతున్నాం. అయినా భూమి ని నమ్ముకున్నాం కాబట్టి సాగు చేస్తున్నాం. మీరొచ్చిన వెంటనే మూతపడ్డ షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది అని హరిపాలెంనకు చెందిన చెరుకు రైతు శరగడం లక్ష్మణమూర్తి వైఎస్‌ జగన్‌ను హరిపాలెం వద్ద కలిసి ఆనందం వ్యక్తంచేశారు.– శరగడం లక్ష్మణమూర్తి,చెరకు రైతు హరిపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top