అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీలో శ్రీకాంత్‌

Duvvada Srikanth help For Agrigold Victims Committee - Sakshi

శ్రీకాకుళం, కాశీబుగ్గ : వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దువ్వాడ శ్రీకాంత్‌ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం పలాస–కాశీబుగ్గ పట్టణ పార్టీ అధ్యక్షునిగా, 15వ వార్డు కౌన్సిలర్‌గా, 13 వర్తక సంఘాలకు గౌరవ అధ్యక్షునిగా, ఆర్టీసీ యూనియన్‌లో గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. తనను కమిటీలో నియమించినందుకు పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కృష్ణదాస్, రెడ్డిశాంతి, దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు శ్రీకాంత్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే కమిటీలో విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మజ్జి సుర్రప్పడు, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పెండ రమణను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top