ఆడియాశల జడివాన

ఆడియాశల జడివాన


 సాక్షి, ఏలూరు : ఓ వైపు ఎండలు.. మరోవైపు ఎన్నికలతో వేడెక్కిన జిల్లా ఒక్కసారిగా చల్లబడింది. అల్పపీడన ద్రో ణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రైతుల ఆశలను అడియూశలు చేసింది. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు మండలం శ్రీపర్రులో పిడుగులు పడ్డారుు. చేప పిల్లల్ని దిగుమతి చేసే పనిలో నిమగ్నమైన కూలీల్లో ఒకరైన ఆలవాల శ్రీనివాసరావు(25) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సైదు వంశీ, ముంగర చిన్నరాజు అనే యువకులు గాయాల పాలయ్యారు.



 చేపల వాన

తాడేపల్లిగూడెం మండలం, రామన్నగూడెంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. వాన నీటితో కలసి ఆకాశం నుంచి చేపపిల్లలు, రొయ్యలు పడ్డారుు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంటి పెరట్లో ఉన్న పాత్రల్లో సైతం చేపలు పడ్డారుు. కొందరువాటిని సేకరించి కూర వండుకున్నారు.



 ఆందోళనలో అన్నదాతలు

 అకాల వర్షం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. మెట్ట ప్రాంతాల్లో పనలపై ఉన్న నువ్వులు, మినుము, పెసర వంటి అపరాల పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఎండబెట్టిన మొక్కజొన్న కండెలు తడిసిపోయూరుు. ఈదురుగాలులకు పలుచోట్ల మామిడి కాయలు నేలరాలారుు. మామిడి, నిమ్మ, ఆరుుల్‌పామ్ చెట్లు నేలకొరిగారుు. జిల్లాలో వరి పంట మాసూళ్లు దాదాపుగా పూర్తరుునా.. ఆలస్యంగా నాట్లు వేసిన డెల్టాలోని పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట తదితర ప్రాంతాల్లో కోతలు ముమ్మరంగా సాగుతున్నారుు. పలుచోట్ల పంట పనలపై ఉంది. ధాన్యం బస్తాలు, వరి పనలు తడిసిపోవడంతో రైతులకు బెంగపట్టుకుంది. అయితే వాటి విస్తీర్ణం తక్కువగానే ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గత పంటను తుపాన్లు తుడిచిపెట్టేయడంతో  ఈ పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇది కూడా దక్కకపోతే వారు కోలుకోవడం చాలా కష్టం.



 అప్రమత్తమైన యంత్రాంగం

 విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం నుంచి అందిన సమాచారం ప్రకారం రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలను అప్రమత్తం   చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. భారీ వర్షాలు కురిస్తే చేపట్టాల్సిన సహాయక చర్యలపై జేసీ బాబూరావునాయుడు, ఎస్పీ హరికృష్ణ, జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం సమీక్ష జరిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి గ్రామస్థాయి నుంచి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఎవరైనా సెలవుపై వెళితే వెంటనే విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, పంటలకు నష్టం వాటిల్లకుండా, వాగులు వంకలు పొంగితే ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిం చారు. కిరోసిన్‌ను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. అధికారులు ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని, తక్షణం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top