కడపలో తాగుబోతు వీరంగం
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నగర శివార్లలో మద్యం సేవించి కారులో కడప నగరంలోకి వచ్చాడు. అయితే మద్యం మత్తులో కారును ఇష్టమొచ్చినట్టు నడిపి వీరంగం సృష్టించాడు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు... అశోక్ అనే యువకుడు ఎర్రముక్కపల్లె సర్కిల్ నుంచి సంధ్యా థియేటర్ వరకూ కారును ఇష్టానుసారం నడిపి హల్ చల్ చేశాడు. దీంతో జనాలు హడలిపోయారు. కారు వేగంగా నడుపుతూ రెండు ఆటోలను ఢీకొట్టాడు. దీంతో ఒక ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.